Navratri Celebration: భారతదేశం మాత్రమే కాదు, పలు దేశాల్లోని హిందువులు ‘‘నవరాత్రి’’ వేడుకల్ని ఘనంగా జరుపుకుంటున్నారు. అయితే, ఇప్పుడు నవరాత్రి వేడుకలకు సంబంధించిన రెండు వీడియోలు ఆన్లైన్లో విస్తృతంగా వైరల్ అయ్యాయి. ఈ రెండు కూడా భారతదేశానికి చెందిన వీడియోలు కాదు, పాకిస్తాన్ లో నవరాత్రి, గర్బా ఉత్సవాలకు సంబంధించిన వీడియోలు కావడం విశేషం. ముస్లిం మెజారిటీ, మతోన్మాదులకు పేరుగాంచిన పాకిస్తాన్ లో ఈ రకంగా హిందువులు వేడుకలు జరుపుకుంటున్నారా.?? అని నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. పాకిస్తాన్లో భారతీయ పండగ ఆధిపత్యం చెలాయిస్తుందని కామెంట్స్ చేస్తున్నారు.
Read Also: CM Chandrababu: 1.63 కోట్ల మంది పేదలకు రూ.25 లక్షల వరకు ఉచితంగా చికిత్సలు అందించేలా పాలసీ..!
వీడియోల్లో ఒకదానిని పాకిస్తాన్ హిందూ నివాసి ప్రీతం దేవ్రియా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. ధీరజ్ అనే మరో యూజర్ కరాచీలో వేడుకల్ని అప్లోడ్ చేశారు. చాలా మంది ముస్లిం దేశంలో ఇలా నవరాత్రి వేడుకలు జరగడాన్ని చూసి ఆనందం వ్యక్తం చేశారు. పాకిస్తాన్లోని హిందూ బంధువులకు భారత్ తరుపున నవరాత్రి శుభాకాంక్షలు చెబుతున్నారు. ఒక యూజర్.. పాకిస్తాన్ లోని హిందువులు సురక్షితంగా ఉన్నారని ఆశిస్తున్నాను అని కామెంట్ చేశారు.
విభజన సమయంలో పాకిస్తాన్లో కొంత మంది హిందువులు ఉండిపోయారు. ముఖ్యంగా సింధ్ ప్రావిన్సులో గణనీయంగా హిందువులు ఉన్నారు. కరాచీ, హైదరాబాద్ వంటి నగరాల్లో హిందువుల సంఖ్య ఎక్కువగా ఉంది. ఉమర్ కోట్, మీఠీ వంటి పట్టణాల్లో హిందువుల సంఖ్య ముస్లింల కన్నా ఎక్కువగా ఉంటుంది.