NTV Telugu Site icon

Navneet Kaur Rana: అసదుద్దీన్ సభ్యత్వాన్ని రద్దు చేయాలని రాష్ట్రపతికి లేఖ

Rna

Rna

పార్లమెంట్‌లో ఎంపీల ప్రమాణస్వీకారం సందర్భంగా ఆయా ఎంపీలు రకరకాలైన స్లోగన్లు ఇచ్చారు. ఎన్డీఏ కూటమి నేతలు ఒకలా.. ఇండియా కూటమి నేతలు మరోలా నినాదాలు చేశారు. ఇక హైదరాబాద్ ఎంఐఎం ఎంపీ అసద్దుదీన్ మాత్రం.. ప్రమాణస్వీకారం తర్వాత జై పాలస్తీనా అంటూ నినాదం చేశారు. ఈ ఘటన సభలో దుమారం రేపింది. రికార్డుల నుంచి తొలగించాలంటూ ఎన్డీఏ సభ్యులు డిమాండ్ చేశారు.

ఇది కూడా చదవండి: Dushyant Chautala: రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కి మద్దతు..బీజేపీకి షాక్ ఇచ్చిన మాజీ మిత్రుడు..

తాజాగా అమరావతి మాజీ ఎంపీ, సినీ నటి నవనీత్‌ కౌర్ రాణా.. అసదుద్దీన్ సభ్యత్వాన్ని రద్దు చేయాలంటూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ రాశారు. ఈ మేరకు రాష్ట్రపతికి నవనీత్ రాణా గురువారం లేఖ రాశారు. ఒవైసీ తన ప్రమాణం స్వీకార కార్యక్రమంలో ‘జై పాలస్తీనా’ నినాదాన్ని లేవనెత్తడం ద్వారా భారత్‌కు బదులుగా మరో దేశానికి విధేయతను వ్యక్తం చేశారని ఆమె తన లేఖలో పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: MP Airport: కూలిన టెర్మినల్ పైకప్పు.. కారు ధ్వంసం.. తప్పిన ప్రాణాపాయం

జూన్ 25వ తేదీన అసదుద్దీన్ పార్లమెంట్‌లో ప్రమాణం చేశారు. ఈ ప్రమాణంలో అసదుద్దీన్ ఒవైసీ.. జై బీమ్, జై మీమ్, జై తెలంగాణ, జై పాలస్తీనా అంటూ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై సభలోని పలువురు కేంద్ర మంత్రులతోపాటు వివిధ పార్టీలకు చెందిన ఎంపీలు సైతం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రొటెం స్పీకర్ స్థానంలో ఉన్న రాధా మోహన్ సింగ్ స్పందించారు. ఒవైసీ చేసిన వ్యాఖ్యలను పరిశీలించి రికార్డుల నుంచి తొలగిస్తామని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. తాజాగా నవనీత్ కౌర్.. రాష్ట్రపతికి లేఖ రాసి సభ్యత్వాన్ని రద్దు చేయమని కోరారు.

ఇదిలా ఉంటే లోక్‌సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా కూడా అసదుద్దీన్‌పై నవనీత్ కౌర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. సోషల్ మీడియా వేదికగా కూడా ధ్వజమెత్తారు. హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవిలత తరపున ఆమె ప్రచారం చేశారు. ఆశ్చర్యం ఏంటంటే.. ఇద్దరూ కూడా ఓటమి పాలయ్యారు.

ఇది కూడా చదవండి: Navneet Kaur Rana: అసదుద్దీన్ సభ్యత్వాన్ని రద్దు చేయాలని రాష్ట్రపతికి లేఖ