పంజాబ్ పిసిసి అధ్యక్షుడుగా నవజోత్ సింగ్ నియామకం అయ్యారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. అలాగే… నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్ లను కూడా నియమించింది ఏఐసిసి అధిష్ఠానం. వర్కింగ్ ప్రెసిడెంట్ లుగా సంగత్ సింగ్ గిలిజియన్, సుఖవీందర్ సింగ్ డానీ, పవన్ గోయల్, కుల్జీత్ సింగ్ నగ్రా లను నియామకం చేసింది కాంగ్రెస్ అధిష్టానం. ఈ మేరకు నియామకాలను ఆమోదిస్తూ ఏఐసిసి అధినేత్రి సోనియా గాంధీ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.