NTV Telugu Site icon

Road Accident: బస్సు ట్రక్కు ఢీ.. 10 మంది సాయి భక్తులు మృతి

Nashik Maharashtra Accident

Nashik Maharashtra Accident

Road Accident: నాసిక్-షిర్డీ హైవేపై బస్సు ఢీకొన్న ఘటనలో ఇద్దరు చిన్నారులు సహా 10 మంది మృతి చెందగా, 34 మందికి పైగా గాయపడ్డారు. మహారాష్ట్రలో యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సు శుక్రవారం ట్రక్కును ఢీకొట్టింది. పతారే గ్రామ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.

Read also: Traffic Jam: టోల్​ ప్లాజాల వద్ద ట్రాఫిక్ జామ్​ టైంవేస్ట్ చేసుకోవద్దన్న సజ్జనార్​

షిర్డీ సాయిబాబా ఆలయానికి వెళ్తున్న ప్రైవేట్ బస్సు ట్రక్కును ఢీకొనడంతో 10 మంది అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బస్సులో ఉన్న చాలా మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. మొత్తం 50 మంది ప్రయాణికులు థానే నుంచి బస్సు ఎక్కారు. ఉల్లాస్‌నగర్‌ నుంచి సాయి దర్శనానికి బయలుదేరిన 15 బస్సుల్లో ఇదొకటి అని పోలీసులు తెలిపారు. చనిపోయిన 10 మందిలో ఐదుగురు మహిళలు, ముగ్గురు పురుషులు, ఇద్దరు చిన్నారులు ఉన్నారని, గాయపడిన 34 మందిని నాసిక్ జిల్లా ఆసుపత్రి, ప్రైవేట్ ఆసుపత్రి, సిన్నార్ ఆసుపత్రిలో చేర్చినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో హైవేపై ట్రాఫిక్‌ జామ్‌ కావడంతో.. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొ్న్నారు. ప్రయాణిలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా పోలీసులు హైవేని క్లియర్‌ చేశారు. ప్రయాణించేటప్పుడు అప్పమత్తంగా ఉండాలని కోరారు.

Read also: Dog Attack Child: బాలిక పై వీధి కుక్కుల దాడి.. పరిస్థితి విషమం

బస్సు ప్రమాదంలో మృతుల పట్ల సంతాపం వ్యక్తం చేసిన మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే, మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. ఈ ఘటనపై విచారణ జరిపించాలని సంబంధిత అధికారులను సీఎం ఆదేశించారు.

ltr”>Maharashtra CM Eknath Shinde expresses condolences on the loss of lives in a bus accident on Nashik-Shirdi highway, announces ex-gratia of Rs 5 lakhs each to the families of the deceased. The CM has ordered relevant authorities to conduct an investigation into the incident. https://t.co/cJMws5y9b2

— ANI (@ANI) January 13, 2023


Negligence Doctors: వైద్యుల నిర్లక్ష్యంతో బాలింత మృతి.. వైద్యపరీక్షలు చేయకుండా ఆపరేషన్‌