Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Nashik Corporate Jihad Bpo Harassment Case Details

Corporate Jihad: నాసిక్ ‘‘కార్పొరేట్ జిహాద్’’.. హిందూ ఉద్యోగులే టార్గెట్.. నమాజ్ చేస్తేనే సాలరీ హైక్..

Published Date :April 12, 2026 , 6:48 pm
By Venu Goapl Reddy
  • సంచలనంగా నాసిక్ ‘‘కార్పొరేట్ జిహద్’’ కేసు..
  • సీనియర్ ముస్లిం ఉద్యోగుల అరాచకాలు..
  • నమాజ్ చేయాలని, బీఫ్ తినాలని ఒత్తిడి..
  • ఈ కేసులో ఏడుగురు నిందితుల అరెస్ట్..
Corporate Jihad: నాసిక్ ‘‘కార్పొరేట్ జిహాద్’’.. హిందూ ఉద్యోగులే టార్గెట్.. నమాజ్ చేస్తేనే సాలరీ హైక్..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Corporate Jihad: నాసిక్ ‘‘ కార్పొరేట్ జిహాద్’’ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రముఖ ఐటీ కంపెనీ బిజినెస్ ప్రాసెస్ అవుట్‌సోర్సింగ్(బీపీఓ) యూనిట్‌లోని ఉద్యోగులపై లైంగిక వేధింపులు, మత విషయాల్లో బలవంతాలకు పాల్పడటం వంటివి సంచలనంగా మారాయి. ఈ కేసులో మొదటి ఫిర్యాదు మార్చిలో అందింది. దర్యాప్తు జరిగినా కొద్ది, బాధితుల సంఖ్య పెరిగింది. ఈ కేసు తీవ్రత దృష్ట్యా మహారాష్ట్ర ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది.

ఉద్యోగుల జీతం పెంపు, ఉద్యోగ భద్రత కోసం నమాజ్ చేయాలని, బీఫ్ తినాలని బలవంతం చేసినట్లు బాధితులు ఆరోపించినట్లు సమాచారం. ఒక యువతి మార్చి 25న డియోలాలి క్యాంప్ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించడంతో ఈ కేసు మొదట వెలుగులోకి వచ్చిందని తెలుస్తోంది. 2022 నుంచి 2026 వరకు చాలా ఏళ్లుగా ఈ సంఘటలు జరిగాయని, లైంగిక వేధింపులు, మతపరమైన మనోభావాలను దెబ్బతీసే చర్యలు కూడా ఉన్నాయని ఆమె ఆరోపించింది.

ఈ ఫిర్యాదు తర్వాత, నాసిక్ పోలీసులు దర్యాప్తును విస్తృతం చేశారు. రోజుల వ్యవధిలోనే బాధితులు ముందుకు వచ్చారు. ఈ కేసులో మొత్తం 9 ఎఫ్ఐఆర్‌లు నమోదయ్యాయి. ఇందులో 8 మంది మహిళలు, ఒక పురుషుడి వాంగ్మూలాలను పోలీసులు నమోదు చేశారు. ఈ కార్పొరేట్ రాకెట్‌ను వెలికితీయడానికి పోలీసులు ప్రత్యేకంగా అండర్ కవర్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ యూనిట్‌లో మొత్తం ముగ్గురు మహిళా అధికారులు కీలకంగా వ్యవహరించారు. సాక్ష్యాలు బయటకు తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు.

Read Also: Devendra Fadnavis: కాంగ్రెస్ నుంచి రాహుల్ గాంధీని తొలగించవచ్చు.. ఫడ్నవీస్ సంచలన వ్యాఖ్యలు..

టీమ్ లీడర్ పోస్టుల్లో చాలా కాలంగా పనిచేస్తున్న ముస్లిం ఉద్యోగులు, తమ కన్నా జూనియర్లు అయిన హిందూ ఉద్యోగులను లైంగికంగా దోపిడీ చేశారు. బాధితులు ఉద్యోగం కోల్పోతామనే భయం లేదా ఇతర చర్యలకు గురవుతామనే భయంతో వీరిపై ఫిర్యాదు చేయడానికి వెనుకాడారు. ఈ సంఘటనపై హెచ్‌ఆర్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని బాధితులు ఆరోపించారు. ఈ కేసులో ఆసిఫ్ అన్సారీ, షఫీ షేక్, షారుఖ్ ఖురేషీ, రజా మెమన్, తౌసిఫ్ అత్తర్, డానిష్ షేక్‌లతో సహా పలువురిని అరెస్టు చేశారు. ఒక ఫిర్యాదు చేసినా పట్టించుకోలేని కారణంగా ఒక హెచ్ఆర్ అధికారిని కూడా అదుపులోకి తీసుకున్నారు. తమ అధికారాన్ని ఉపయోగించుకుని నిందితులు తమ కింది ఉద్యోగుల్ని బలవంతంగా లొంగదీసుకున్నట్లు తేలింది.

ఈ కేసును బీజేపీ నేత నితీష్ రాణే కార్పొరేట్ జిహాద్‌గా అభివర్ణించారు. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఈ విషయం తీవ్రమైందిగా చెప్పారు. ఇలాంటి సంఘటనలకు చోటు లేదని, దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. హిందూ బాధితుల్ని నమాజ్ చేయాలని, బీఫ్ తినాలని బలవంతం చేసినట్లు, మతాన్ని అవమానించినట్లు మహారాష్ట్ర మంత్రి గిరీష్ మహాజన్ ఆరోపించారు. బాధితుల మతం మార్చడానికి కూడా ప్రయత్నించినట్లు చెప్పారు.

Nashik, Maharashtra: Minister Girish Mahajan says, "In the TCS company in Nashik, where many young girls work. The way this incident has happened is very unfortunate and shameful. Regarding religious conversion, there are 4-5 Muslim company workers and some officers who lured the… pic.twitter.com/LQ8UcAjfX4

— IANS (@ians_india) April 10, 2026

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Corporate Jihad
  • Crime News
  • IT company controversy
  • Maharashtra
  • Nashik BPO case

తాజావార్తలు

  • Corporate Jihad: నాసిక్ ‘‘కార్పొరేట్ జిహాద్’’.. హిందూ ఉద్యోగులే టార్గెట్.. నమాజ్ చేస్తేనే సాలరీ హైక్..

  • KTR : తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ కలిసి దోచుకుంటున్నారు

  • Sunil Gavaskar: బుడ్డోడా నీ కెరీర్ జాగ్రత్త.. వైభవ్ సూర్యవంశీకి సునీల్ గవాస్కర్ స్ట్రాంగ్ వార్నింగ్!

  • Iran: మా నమ్మకాన్ని గెలుచుకోవడంలో అమెరికా విఫలమైంది..

  • Home Hacks: సాలెగూళ్లకు ‘చెక్’ పెట్టే మ్యాజిక్.. మీ వంటింట్లోనే ఉంది.!

ట్రెండింగ్‌

  • Super Juice: వేసవి వేడికి ఈ పండు రసమే ‘రామబాణం’.. బరువు తగ్గడమే కాదు, ముఖం కూడా మెరిసిపోతుంది.!

  • అమృతం ఎక్కడో లేదు.. మీ వంటింట్లోనే ఉంది..! వేసవిలో ఈ ఒక్క గ్లాసు పానీయం చేసే మ్యాజిక్..!

  • Parenting Tips: తల్లిదండ్రులూ తస్మాత్ జాగ్రత్త! రిజల్ట్స్ వచ్చేశాయ్.. పిల్లల ప్రవర్తనను గమనించండి!!

  • Vegetable Storage Tips: వేసవిలో మీ ఆకుకూరలు త్వరగా ఎండిపోయి పాడైపోతున్నాయా? అయితే ఈ చిట్కాలను పాటించండి

  • Kitchen Tips : కిచెన్ వ్యర్థమే కాదు.. ఉల్లిపాయ పొట్టులో దాగుంది పవర్ తెలుసా.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions