NASA: భూమి వైపు దూసుకువస్తోన్న నాసా టెలిస్కోప్.. క్రాష్ జోన్లో హైదరాబాద్, ముంబై..
- భూమి వైపు వస్తున్న నాస స్విప్ట్ అబ్జర్వేటరీ టెలిస్కోప్..
- నవంబర్ 4న భూ వాతావరణంలోకి ప్రవేశించే అవకాశం..
- క్రాష్ జోన్ పరిధిలో భారత్.. ముంబై, హైదరాబాద్, బెంగళూర్ నగరాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NASA: అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసాకు చెందిన ‘నీల్ గెహ్రెల్స్ స్విఫ్ట్ అబ్జర్వేటరీ’ స్పేస్ టెలిస్కోప్ భూమివైపు దూసుకొస్తోంది. సుమారు 1500 కిలోల బరువున్న ఈ అంతరిక్ష టెలిస్కోప్ నవంబర్ 04న భూ వాతావరణంలోకి ప్రవేశించి కూలిపోనుంది. ఇలా కూలేటప్పుడు చాలా భాగాలు భూ వాతవరణంలోని ఘర్షణ కారణంగా కాలిబూడిద అవుతాయి. అయితే, కొన్ని భారమైన శకలాలు మాత్రం భూమిపై పడే అవకాశం ఉంది.
క్రాష్ జోన్లో భారత్..
ఇదిలా ఉంటే, ఈ శాటిలైట్ టెలిస్కోప్ కూలిపోయే క్రాష్ జోన్ పరిధిలో భారత్ కూడా ఉంది. ముంబై, హైదరాబాద్, బెంగళూర్, చెన్నై వంటి నగాలు ఈ పరిధిలో ఉన్నట్లు నివేదికలు వెల్లడించాయి. నాసా అంచనాల ప్రకారం, నవంబర్ 4న అమెరికా తూర్పు కాలమాన ప్రకారం తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో(భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2 గంటలకు) ఈ టెలిస్కోప్ భూ వాతావరణంలోకి ప్రవేశించే అవకాశం ఉంది. నాసా మిషన్ చీఫ్ సైంటిస్ట్ బ్రాడ్ సెంకో మాట్లాడుతూ.. ఆఫ్రికా, ఆస్ట్రేలియా, భారత్, ఆగ్నేయాసియా, మధ్య, దక్షిణ అమెరికాలోని కొన్ని ప్రాంతాలు ఈ టెలిస్కోప్ తిరిగి రీఎంట్రీ పరిధిలో ఉన్నాయని తెలిపారు.
Also Read
ఈ పరిధి దక్షిణ అక్షాంశం 20.6 డిగ్రీల నుంచి ఉత్తర అక్షాంశం 20.6 డిగ్రీల మధ్య విస్తరించి ఉంది. భారత్ విషయానికొస్తే.. పశ్చిమ తీరంలోని డామన్ నుంచి తూర్పు తీరంలోని ఒడిశా రాష్ట్రం కటక్ వరకు దక్షిణంగా ఉన్న ప్రాంతాలు ఈ పరిధిలోకి వస్తాయి. దీంతో ముంబై, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాలు ఈ భౌగోళిక పరిధిలో ఉన్నట్లు పేర్కొన్నారు. అయితే, టెలిస్కోప్ మొత్తం బరువు 1500 కిలోలు అయితే, దీంట్లో 100 కిలోల విడిభాగాలు మాత్రమే భూ వాతావరణంలోకి ప్రవేశించే అవకాశం ఉన్నాయి. చాలా వరకు సముద్రంలోనే పడే ఛాన్స్ ఉంది.
నాసా మిషన్ విఫలం తర్వాత..
2004 నవంబర్ 20న అంతరిక్షంలోకి ప్రయోగించిన ఈ టెలిస్కోప్ .. అనుకున్న దాని కన్నా ఎక్కువ కాలం పనిచేసింది. దాదాపు 22 ఏళ్ల పాటు అంతరిక్ష పరిశోధనలు చేసిన ఈ టెలిస్కోప్, 2000కు పైగా గామా కిరణాల విస్పోటనాలను, 1400 సూపర్ నోవాలను పరిశీలించింది. అయితే, దీర్ఘకాలంగా సేవలందించడంతో దీని కక్ష్య క్రమంగా క్షీణించింది. దీనిని సరైన కక్ష్యలో పెట్టేందుకు నాసా చేపట్టిన మిషన్ కూడా విఫలం కావడంతో, ఇది భూమి పై కూలడం అనివార్యంగా మారింది.
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Results: మున్సిపల్ ఎన్నికల ఫలితాల లైవ్ అప్డేట్స్.. పూర్తి ఆధిక్యంలో కూటమి!
-
NASA: భూమి వైపు దూసుకువస్తోన్న నాసా టెలిస్కోప్.. క్రాష్ జోన్లో హైదరాబాద్, ముంబై..
-
Healthy Food Buying Tips : ప్యాకెట్‌పై ప్రోటీన్ అని ఉంటే నమ్మేస్తున్నారా? కొనేముందు ఈ 4 విషయాలు చూడండి
-
CM Chandrababu: మురసు తుఫాన్‌పై సీఎం చంద్రబాబు సమీక్ష.. 45 వేల మందికి పైగా అధికారులతో టెలికాన్ఫరెన్స్
-
Zomato Host Mode : జొమాటోలో కొత్త ఫీచర్.. అతిథులకు ఫుడ్ ధరలు కనిపించవు
-
SIR Protest: SIR పోరాటంలో కాంగ్రెస్ కొత్త ప్లాన్.. నవంబర్ 5న బెంగళూర్‌లో నిరసన!
ట్రెండింగ్
-
Bhai Dooj 2026: భాయి దూజ్ 2026.. అన్నదమ్ముల కోసం అక్కాచెల్లెళ్లు చేసే ఈ పూజ వెనుక కథ ఇదే.!
-
Cheesy Chicken Pasta Recipe: కేవలం 15 నిమిషాల్లో చీజీ చికెన్ పాస్తా.. ఇంట్లోనే సులభంగా చేసేయండి.!
-
Laundry Tips : హోటల్ టవల్స్ ఎప్పుడూ ఎందుకు మెత్తగానే ఉంటాయి.? ఈ చిన్న చిట్కాలే రహస్యం.!
-
Dhanteras Story : అమృత కలశంతో సముద్రం నుంచి ధన్వంతరి.. ధన్తేరస్ వెనుక అసలు కథ ఇదే!
-
100W ఛార్జింగ్, 50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లేతో Poco X8s గ్లోబల్ లాంచ్..!