NTV Telugu Site icon

Maharashtra PCC: మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్ష పదవికి నానా పటోలే రాజీనామా

Nana Patelo

Nana Patelo

Maharashtra PCC: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో విపక్ష మహా వికాస్‌ అఘాడీ ఘోర ఓటమిని చవి చూసింది. ఈ నేపథ్యంలో మరో కీలక పరిణామం జరిగింది. ‘మహా’ ఎన్నికల్లో పార్టీ ఓటమికి పూర్తి బాధ్యత వహిస్తూ కాంగ్రెస్‌ పీసీసీ అధ్యక్ష పదవికి నానా పటోలే రిజైన్ చేశారు. ఎన్నికల్లో ఆయన సకోలి స్థానం నుంచి 208 ఓట్ల మార్జిన్‌తో విజయం సాధించారు. అయితే, మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 288 స్థానాలు ఉండగా.. మహాయుతి కూటమి 233 స్థానాల్లో గెలిచింది. అటు ప్రతిపక్ష మహా వికాస్‌ అఘాడీ కూటమి 51 చోట్ల విజయం సాధిచింది. కూటమిలో భాగంగా 101 స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్‌ కేవలం 16 స్థానాలు మాత్రమే గెలుచుకోవడంతో పార్టీకి భారీ షాక్ తగిలింది. మహారాష్ట్ర ఏర్పడిన నాటి నుంచి ఎప్పుడూ లేనంత బలహీనంగా హస్తం పార్టీ మారిపోయింది.

Read Also: Gold Price Today: ఊహించని రీతిలో తగ్గిన బంగారం ధర.. నేడు తులం ఎంతుందంటే?

ఇక, 2014లో కాంగ్రెస్ పార్టీపై వెల్లువెత్తిన అవినీతి ఆరోపణలు.. ప్రధాని మోడీ హవాతో మహారాష్ట్రలో కాంగ్రెస్‌ తీవ్రంగా నష్ట పోయింది. అప్పట్లో కేవలం 42 సీట్లలో మాత్రమే విజయం సాధించింది. నాటి నుంచి ఇప్పటి వరకు మళ్లీ కోలుకోలేదు. తాజా ఎన్నికల్లో కనీసం 25 స్థానాలు కూడా సాధించలేకపోయింది. కొన్ని వర్గాలపై అధికంగా ఆధారపడటం, పార్టీ నేతలు ప్రజల్లోకి వెళ్లకపోవడం.. తదితర అంశాలతో పార్టీ ప్రజాదరణను కోల్పోతోందని రాజకీయ నిపుణులు తమ అభిప్రాయం వెల్లడించారు. అయితే, 2021లో మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా నానా పటోలే బాధ్యతలు తీసుకున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో.. ఆయన నాయకత్వంలో కాంగ్రెస్ పోటీ చేసిన 17 స్థానాలకు గాను 13 స్థానాల్లో విజయం సాధించి.. అద్భుతమైన ప్రదర్శన చూపించింది.