Namo Bharat: భారతదేశంలో వేగవంతమైన ట్రైన్ ఏదంటే ‘‘వందే భారత్’’ అనే సమాధానం వచ్చేంది. అయితే, ఇప్పుడు అది మారిపోయింది. ఢిల్లీ -మీరట్ కారిడార్‌లో ప్రయాణించిన ‘‘నమో భారత్’’ గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించి, దేశంలో అత్యంత వేగవంతమైన రైలుగా అవతరించింది. వందే భారత్ రికార్డును బద్దలు కొట్టింది. ఢిల్లీ నుంచి మీరట్ వరకు 84 కి.మీ RRTS కారిడార్‌ను రూ.30,274 కోట్లతో నిర్మిస్తున్నారు.
వందేభారత్‌కు ముందు దేశంలో అత్యంత వేగమైన రైలుగా ‘‘గతిమాన్ ఎక్స్‌ప్రెస్’’కు పేరుండేది. దీనిని 2016లో ప్రారంభించారు. దేశంలో తొలి సెమీ-హై స్పీడ్ రైలు ఇదే. ఇది హజరత్ నిజాముద్దీర్-ఆగ్రాల మద్య ఏర్పాటు చేసిన ట్రాక్‌పై గంటకు 160 కి.మీ వేగంతో నడిచేది. ఆ తర్వాద వందేభారత్ ట్రైన్ వేగవంతమైన ట్రైన్‌గా నిలిచింది. అయితే, రైల్వే మంత్రిత్వ శాఖ జూన్ 24, 2024లో ఎలాంటి కారణాలు పేర్కొనకుండా వాటి వేగాన్ని గంటకు 160 నుంచి 130 కి.మీ తగ్గించాలని నిర్ణయించింది. ప్రస్తుతం, భారత్‌లో అన్ని రైళ్లు గంటకు 130 కి.మీ గరిష్ట వేగ పరిమితితో నడుస్తున్నాయి.
Read Also: Nalgonda: పదో తరగతి విద్యార్థినిపై ప్రభుత్వ ఉపాధ్యాయుడి వేధింపులు.. మూడు నెలలుగా…
తూర్పు ఢిల్లీలోని న్యూ అశోక్ నగర్ మరియు ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ సౌత్ మధ్య సేవలందిస్తున్న నమో భారత్ రైలు ఈ మార్గంలోని 11 స్టేషన్లలో కొన్నింటి మధ్య కొన్ని సెకన్ల పాటు గరిష్టంగా 160 కి.మీ/గంట వేగాన్ని చేరకుంటుంది. ఢిల్లీలోని సారాయ్ కాలే ఖాన్ నుంచి ఉత్తర్ ప్రదేశ్ మోడీపురం వరకు 16 స్టేషన్లతో కూడి మొత్తం 82.15 కిమీ. పొడవైన కారిడార్ త్వరలో ప్రారంభించే అవకాశం ఉందని అని నేషనల్ క్యాపిటల్ రీజినల్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ లిమిటెడ్ (NCRTCL) అధికారులు తెలిపారు. భారత ప్రభుత్వం (50 శాతం), ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హర్యానా, రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వాల (ఒక్కొక్కటి 12.5 శాతం) జాయింట్ వెంచర్ అయిన NCRTC దేశంలోని మొట్టమొదటి ప్రాంతీయ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్‌ను అమలు చేస్తోంది.