Deepika Padukone: రూ.100 కోట్ల సినిమాలతో బాలీవుడ్ బ్యూటీ రికార్డ్.. కత్రినా, అలియా కంటే ముందున్న స్టార్ హీరోయిన్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Deepika Padukone: భారతీయ సినీ పరిశ్రమలో తన అద్భుతమైన నటన, గ్లామర్‌తో దశాబ్ద కాలానికి పైగా అగ్ర కథానాయికగా వెలుగుతున్న బాలీవుడ్ స్టార్ బ్యూటీ దీపికా పదుకొణె బాక్సాఫీస్ వద్ద సరికొత్త హిస్టారికల్ రికార్డు సృష్టించింది. వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ భారీ కమర్షియల్ సక్సెస్‌లను అందుకుంటున్న ఆమె, ఇండియన్ సినీ చరిత్రలోనే మరే ఇతర నటికి సాధ్యం కాని రీతిలో అత్యధికంగా 15 సినిమాలను ₹100 కోట్ల క్లబ్లో నిలబెట్టి ఆల్‌టైమ్ ‘బాక్సాఫీస్ క్వీన్’ గా అవతరించింది.
బాక్సాఫీస్ ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. దీపికా కెరీర్లో నటించిన అత్యధిక చిత్రాలు ఈ భారీ మైలురాయిని దాటగా, గ్లోబల్ వైడ్‌గా ఆమె సినిమాల మొత్తం వసూళ్లు ₹10,000 కోట్ల మార్కుకు చేరువలో ఉన్నాయి. ఆమె నటించిన కల్కి 2898 AD, పఠాన్, జవాన్, పద్మావత్, చెన్నై ఎక్స్‌ప్రెస్, యే జవానీ హై దీవానీ, బాజీరావ్ మస్తానీ, హ్యాపీ న్యూ ఇయర్, రామ్-లీలా, రేస్ 2, ఓం శాంతి ఓం, కాక్టైల్, పీకూ, ఫైటర్, సింగం అగైన్ వంటి 15 బ్లాక్‌బస్టర్ సినిమాలు ఈ వంద కోట్ల జాబితాలో నిలిచాయి. ఈ లీడర్‌బోర్డ్‌లో దీపికా మొదటి స్థానంలో నిలవగా, ఆమె తర్వాతి స్థానాల్లో కత్రినా కైఫ్ (14 సినిమాలు), అలియా భట్ (12 సినిమాలు), కరీనా కపూర్ (10 సినిమాలు) ఉన్నారు.
Also Read
- Nayanthara: నయన్ రాజకీయాల్లోకి వస్తున్నారా? ఒక్క మాటతో తేల్చేసిన భర్త విఘ్నేశ్!
- Jailer 2: టాలీవుడ్‌ను నెల్సన్ లైట్ తీసుకున్నారా?
- Kannada Actresses: క్రేజీ ప్రాజెక్టులు.. తేలని రిలీజ్లు.. టాలీవుడ్లో కన్నడ భామల బ్యాడ్ టైమ్!
- Karthik Subbaraj : శిష్యుడు దర్శకుడవుతుంటే గర్వంగా ఉంది.. కార్తీక్ సుబ్బరాజ్ ఎమోషనల్ కామెంట్స్!
అంతేకాకుండా, ఇండియన్ సినీ చరిత్రలోనే ఏకంగా రెండు అంతకంటే ఎక్కువ సినిమాలు ₹1,000 కోట్ల క్లబ్లో (పఠాన్, కల్కి 2898 AD) కలిగిన ఏకైక భారతీయ నటిగా కూడా దీపికా సరికొత్త చరిత్ర లిఖించింది. ప్రస్తుతం ఆమె ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్లో రాబోతున్న ₹1,000 కోట్ల భారీ సోషియో-ఫాంటసీ సైన్స్-ఫిక్షన్ చిత్రం ‘రాకా’ (Raaka) లో హీరోయిన్గా నటిస్తోంది. అంతేకాదు దీపిక చేతిలో మరో భారీ ప్రాజెక్ట్ ఉంది. షారుఖ్ ఖాన్, సుహానా ఖాన్‌లతో కలిసి సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కింగ్’ సినిమాలో ఆమె కనిపించనుంది. ఈ సినిమా కూడా భారీ అంచనాల మధ్య రూపొందుతోంది. దీంతో దీపిక ఖాతాలో మరిన్ని సినిమాలు రూ.100 కోట్ల జాబితాలో చేరబోతున్నట్లే కనిపిస్తోంది.
- Tags
- cinema
- Deepika Padukone
తాజావార్తలు
-
Sandeep Patil: సచిన్, యువీ, గంభీర్, జహీర్‌ను ఎందుకు తప్పించారు..? సీక్రెట్ బయటపెట్టిన సెలక్షన్ కమిటీ మాజీ ఛైర్మన్
-
LoC Infiltration Bid in Poonch: LoC వద్ద చొరబడేందుకు యత్నం.. ల్యాండ్‌మైన్ పేలుడులో నలుగురు ఉగ్రవాదులు మృతి?
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Nayanthara: నయన్ రాజకీయాల్లోకి వస్తున్నారా? ఒక్క మాటతో తేల్చేసిన భర్త విఘ్నేశ్!
-
Jailer 2: టాలీవుడ్‌ను నెల్సన్ లైట్ తీసుకున్నారా?
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!