Murshidabad Violence: వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌లో ఇటీవల జరిగిన నిరసన కార్యక్రమాలు తీవ్ర హింసకు కారణమయ్యాయి. హిందువులను టార్గెట్ చేస్తూ వారి ఆస్తులపై దాడి చేయడం, వారు బలవంతంగా పారిపోయేలా చేశారు. ఈ ముర్షిదాబాద్ మత హంస జరిగిన రెండు నెలల తర్వాత ప్రధాన సూత్రధారులైన ఇద్దరు వ్యక్తులను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు.
Read Also: Wife Kills Husband: పెళ్లయిన నెలకే భర్తకు విషం పెట్టి చంపిన భార్య..
అరెస్టయిన వారిలో కౌసర్ షేక్, ముర్సలీం షేక్ ఉన్నారు. వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా నిరసన తెలిపేందుకు సంషేర్ గంజ్‌లోని డాక్ బంగాలో జనాన్ని వీరిద్దరు సమీకరించారు. వీరిద్దరూ కూడా సంషేర్ గంజ్ నివాసితులు, ఒక ఎన్‌జీవో సంస్థతో వీరికి సంబంధాలు ఉన్నారు. నిరసనలు జరిగే ప్రదేశానికి ప్రజల్ని ఆకర్షించేందుకు ప్రచారానికి పాల్పడ్డారు. అరెస్టయిన ఇద్దర్ని జంగీపూర్ సబ్-డివిజనల్ కోర్టులో హాజరుపరిచారు, అక్కడ పోలీసులు మరింత విచారణ కోసం వారి కస్టడీని కోరారు.