Mars: అంగారకుడిపై బిలాలకు యూపీ, బీహార్ పట్టణాల పేర్లు..
- అంగారకుడిపై బిలాలకు యూపీ
- బీహార్ పట్టణాల పేర్లు..
- ఒకప్పుడు నీరు ప్రవహించిన ఆనవాళ్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mars: అంగారకుడిపై రెండు బిలాలకు ఉత్తర్ ప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లోని రెండు పట్టణాల పేర్లను పెట్టారు. ఈ గ్రహంపై గతంలో ఎప్పుడూ గుర్తించని మూడు బిలాలను అహ్మదాబాద్‌లోని ఫిజికల్ రీసెర్చ్ లాబొరేటరీ (PRL) శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ యూనియన్ (IAU) ఈ క్రేటర్లకు మాజీ పీఆర్ఎల్ డైరెక్టర్‌తో పాటు చిన్న భారతీయ పట్టణాల పేర్లు పెట్టడానికి ఆమోదించింది.
అంగారకుడిపై ఉన్న థార్సిస్ అగ్నిపర్వత ప్రాంతంలోని ఉన్న మూడు క్రేటర్లను అధికారికంగా లాల్, క్రేటర్, హిల్సా క్రేటర్లుగా పేర్లు పెట్టారు. 1972 నుంచి 1983 వరకు ఫిజికల్ రీసెర్చ్ లాబొరేటరీ (PRL) చీఫ్‌గా ఉన్న భారతీయ భూభౌతిక శాస్త్రవేత్త, మాజీ డైరెక్టర్ ప్రొ. దేవేంద్ర లాల్ గౌరవార్థం ‘‘లాల్ క్రేటర్’’గా పేరు పెట్టారు. లాల్ క్రేటర్‌కి తూర్పు అంచున 10 కి.మీ వెడల్పు ఉన్న బిలానికి ఉత్తర్ ప్రదేశ్‌లోని ముర్సన్ పట్టణం పేరు మీద ‘‘ముర్సన్ క్రేటర్’’గా నామకరణం చేశారు. లాల్ క్రేటర్ యొక్క పశ్చిమ అంచున ఉన్న మరో 10 కి.మీ వెడల్పు గల బిలం “హిల్సా క్రేటర్” అని నామకరణం చేయబడింది. హిల్సా పేరుతో బీహార్‌లో ఒక పట్టణం ఉంది.
Also Read
- Gold Keep In House: ఇంట్లో బంగారం, వెండి ఎంత ఉండాలో తెలుసా.. ఇవిగో రూల్స్..
- Farmer Relief: కరువు వేళ రైతులకు దీపావళి కానుక.. ప్రతి రైతు ఖాతాలో రూ.5,000..!
- Employees Bonus: పండుగ వేళ 10 లక్షల మంది ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. 78 రోజుల బోనస్‌కు క్యాబినెట్ ఆమోదం?
- Patna High Court: "మహిళ మీద పడుకున్నంత మాత్రాన అత్యాచారంగా పరిగణించలేం".. హైకోర్టు సంచలన తీర్పు..
Read Also: RBI: ఆర్బీఐ సంపాదనలో గణనీయమైన పెరుగుదల..పాకిస్తాన్ జీడీపీ కంటే 2.5 రెట్లు ఎక్కువ
లాల్ క్రేటర్ మొత్తం ప్రాంతం లావతో కప్పబడి ఉంది. మార్స్ రికనైసెన్స్ ఆర్బిటర్(ఎంఆర్ఓ) రాడార్ డేటా ప్రకారం.. బిలం నేల క్రింద 45 మీటర్ల మందపాటి అవక్షేపణ నిక్షేపాలని గుర్తించింది. ఇది ఒకప్పుడు మార్స్ ఉపరితలంపై నీరు ప్రవహించిందనే దానికి సాక్ష్యంగా నిలిచింది. నీరు ప్రవహించడం మూలం గానే లాల్ క్రేటర్‌లోకి అవక్షేపాలు జమ అయ్యాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఈ ఆవిష్కరణ అంగారక గ్రహం ఒకప్పుడు తడిగా ఉందని మరియు ఉపరితలంపై నీరు ప్రవహించిందని నిర్ధారిస్తుందని PRL డైరెక్టర్ డాక్టర్ అనిల్ భరద్వాజ్ చెప్పారు.
తాజావార్తలు
-
Vijayawada Drugs: బెజవాడలో మరోసారి డ్రగ్స్ కలకలం.. ఎంబీఏ విద్యార్థిని అరెస్ట్!
-
Gold Keep In House: ఇంట్లో బంగారం, వెండి ఎంత ఉండాలో తెలుసా.. ఇవిగో రూల్స్..
-
Anand Mahindra: 1947 విల్లీస్ జీప్ నుంచి థార్.ఈ వరకు.. ఒక్క వీడియోలో మహీంద్రా 77 ఏళ్ల ప్రయాణం..
-
Andhra Style Amla Pachadi Recipe: ఆంధ్రా స్టైల్ ఉసిరికాయ పచ్చడి.. ఒక్కసారి ఇలా చేస్తే అన్నంలోకి అదిరిపోతుంది!
-
Emraan Hashmi Accident: ఇమ్రాన్ హష్మీకి త్రుటిలో తప్పిన ప్రమాదం.. పల్టీ కొట్టిన కారు..!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..