Schools and Colleges Closed: ఎడతెరిపి లేని వర్షాలు.. ఈ జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Schools and Colleges Closed: భారీ వర్షాలు మహారాష్ట్రలో చాలా ప్రాంతాల్లో జనజీవనాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ముఖ్యంగా ముంబైతో పాటు పరిసర ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని పన్వేల్, ఉరాన్, పాల్ఘర్, రాయగడ్ ప్రాంతాల్లోని పాఠశాలలు, కళాశాలలకు ఈ రోజు (గురువారం) సెలవు ప్రకటించారు. నీటిమునిగిన ప్రాంతాల్లో పరిస్థితి సాధారణ స్థితికి వచ్చిన తర్వాత తరగతులను పునఃప్రారంభించనున్నట్లు స్థానిక అధికారులు తెలిపారు.
అయితే బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC), నవీ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (NMMC), కళ్యాణ్-డొంబివ్లీ మున్సిపల్ కార్పొరేషన్ (KDMC), థానే మున్సిపల్ కార్పొరేషన్ (TMC) పరిధిలోని పాఠశాలలకు మాత్రం ఇప్పటివరకు సెలవు ప్రకటించలేదు. అక్కడ విద్యాసంస్థలు యథావిధిగా కొనసాగుతున్నాయి. భారీ వర్షాల కారణంగా ముంబైలోని వర్లీ, బాంద్రా-కుర్లా కాంప్లెక్స్, జోగేశ్వరి, ముంబ్రా, నవీ ముంబై తదితర ప్రాంతాల్లో రహదారులు నీటమునిగాయి. దీంతో ట్రాఫిక్ తీవ్రంగా దెబ్బతింది. అలాగే హార్బర్ లైన్లో ఓవర్‌హెడ్ వైర్ తెగిపోవడంతో ముంబై లోకల్ రైలు సేవలకు అంతరాయం ఏర్పడింది.
Also Read
- Gargi story Explained: నరమేధపు నేలపై పూసిన గులాబీ! 200 ఏళ్ల తర్వాత ఆ గ్రామంలో పుట్టిన తొలి ఆడపిల్ల!
- UNEP: భారత్‌కు బిగ్ అలర్ట్! విపత్తులు ముంచుకొస్తున్నాయా?
- IndiGo Plane Hits Pole: ఎయిర్‌పోర్టులో ఇండిగో విమానానికి ప్రమాదం.. పోల్‌ను ఢీకొన్న ఫ్లైట్!
- Indian Air Force: పాక్ బోర్డర్లో గర్జనకు సిద్ధమౌతున్న భారత వాయుసేన.. బిగ్ వార్ ప్రిపరేషన్‌కి రెడీ!
వర్షాల ప్రభావంతో మూడు విమానాలను ఇతర విమానాశ్రయాలకు మళ్లించాల్సి వచ్చినప్పటికీ, అనంతరం అవి తిరిగి ముంబైకి చేరుకున్నాయని అధికారులు తెలిపారు. మరోవైపు భారత వాతావరణ శాఖ (IMD) వచ్చే 24 గంటల్లో ముంబై, పరిసర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, బలమైన ఈదురు గాలులు కూడా వీచే అవకాశముందని హెచ్చరించింది.
బీఎంసీ మాన్సూన్ నివేదిక ప్రకారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ముంబై నగరంలో సగటున 49 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. తూర్పు శివారు ప్రాంతాల్లో 99 మి.మీ., పశ్చిమ శివారు ప్రాంతాల్లో 90 మి.మీ. వర్షపాతం నమోదైంది. టాగోర్ నగర్ మున్సిపల్ స్కూల్, విక్రోలీలో అత్యధికంగా 146.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అంధేరి, సాంటాక్రూజ్, ఖార్, బాంద్రా, కుర్లా, విక్రోలీ, పవాయ్, ఘాట్కోపర్, భాండుప్, ములుండ్ తదితర ప్రాంతాల్లో నీటిమునిగిన పరిస్థితులపై ఫిర్యాదులు అందాయని బీఎంసీ వెల్లడించింది. అయినప్పటికీ ప్రజా రవాణా సేవలు కొనసాగుతున్నప్పటికీ, పలు చోట్ల ఆలస్యంగా నడుస్తున్నట్లు అధికారులు తెలిపారు.
తాజావార్తలు
-
Baljit Singh: ఇంట్లో కుళ్లిన స్థితిలో పంజాబీ గాయకుడి మృతదేహం.. రక్తపు మరకలు, చివరికి షాకింగ్ ట్విస్ట్!
-
Konda Surekha: ఇక నిరీక్షణ ముగిసింది.. అతి త్వరలోనే బిగ్ అప్డేట్.. వేచి చూడండి!
-
Kaaka : వచ్చే సంక్రాంతికి మెగాస్టార్ ‘కాకా’ లేనట్టేనా..?
-
Kareena Kapoor: ఆ టైంలో హీరోయిన్ అవ్వాలనే పిచ్చితో అలా చేశాను.. కానీ ఇప్పుడు అది బిగ్ రిగ్రెట్!
-
Irumudi: 200 కోట్లు దాటినా తగ్గని ‘ఇరుముడి’ జోరు.. సెప్టెంబర్ లో మరింత జోరు ఉంటుందా ?
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!