Python in Car: కారులో 7 అడుగుల కొండచిలువ.. బోనెట్ తెరవగానే షాక్..
- ముంబై దహిసర్ వెస్ట్‌లో కారు ఇంజిన్‌లో 7 అడుగుల కొండచిలువ.
- కందర్పాడాలోని మహేశ్వర్ బిల్డింగ్ ప్రాంగణంలో ఘటన.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Python in Car: బైకులో సీటు కింద, హెల్మెట్‌లో పాములు దూరిన సంఘటనలు చాలానే చూశాం. కానీ ముంబైలో ఓ కారులో ఏకంగా 7 అడుగుల భారీ కొండచిలువ కనిపించడంతో ఒక్కసారిగా స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ముంబైలోని దహిసర్ వెస్ట్‌లో ఈ ఊహించని సంఘటన చోటుచేసుకుంది. ఓ నివాసం ప్రాంతంలో పార్క్ చేసిన కారు ఇంజన్ బానెల్లో పాము చక్కగా పడుకుని ఉంది. ఈ ఘటన కందర్పాడాలోని బాపు బాగ్వే రోడ్ సమీపంలోని మహేశ్వర్ బిల్డింగ్ వద్ద జరిగింది.
శనివారం కారు కిందగా ఒక పాము పాకుతూ వెళ్లడాన్ని కొంత మంది గమనించారు. దీంతో వెంటనే వైల్డ్ లైఫ్ రెస్క్యూ టీమ్‌కు సమాచారం ఇచ్చారు. రెస్క్యూ నిపుణుడు సమీర్ గుప్తా, కారు బోనెట్ తెరిచి చూడగానే ఇంజన్ పై భాగంలో కొండచిలువ చుట్టుకుని కనిపించింది. ఎంతో జాగ్రత్తగా దాన్ని బయటకు తీశారు. రెస్క్యూ తర్వాత కొండచిలువకు వైద్య పరీక్షలు నిర్వహించారు. తర్వాత సంజయ్ గాంధీ నేషనల్ పార్క్‌లో విడిచిపెట్టారు.
Also Read
- ISRO: ‘‘ఇస్రో ప్రైవేటీకరణ కాదు’’.. ఉద్యోగులకు చైర్మన్ భరోసా..
- Vijay DMK Attack: అసెంబ్లీలో సీఎం విజయ్ విశ్వరూపం.. డీఎంకేపై తీవ్రస్థాయిలో ఫైర్..
- Talha Saeed: ‘జిహాద్ కొనసాగిస్తాం.. ఢిల్లీ ఎవరిదో మర్చిపోయారా?’.. భారత్‌పై తల్హా సయీద్ విషం
- Supreme Court: డాక్టర్లపై దాడి చేసే రాజకీయ నాయకుల్ని వెంటనే అరెస్ట్ చేయండి.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
కార్లు ఇంజన్లు, బైక్ సీటు కింద ప్రదేశాలు పాములు దూరడానికి అనువుగా ఉండటంతో పాటు చీకటి ప్రదేశాలు కావడంతో పాములు ఇష్టపడుతాయని నిపుణులు చెబుతున్నారు. కారు చాలాసేపు పార్క్ చేసి ఉంటే ఇంజన్ కంపార్ట్మెంట్, టైర్లు, వీల్ ఆర్చ్ ప్రాంతాలను పరిశీలించిన తర్వాతే స్టార్ట్ చేయడం మంచిదని సూచిస్తున్నారు.
Panic gripped Kandarpada in Dahisar after a python was spotted inside a car’s bonnet. The owner alerted a snake rescuer, who carefully rescued the python and later released it at a safe location. The incident left locals in a state of panic. #Dahisar #Mumbai #SnakeRescue pic.twitter.com/CA09M6QHiJ
— Visshal Singh (@VishooSingh) September 7, 2026
తాజావార్తలు
-
Python in Car: కారులో 7 అడుగుల కొండచిలువ.. బోనెట్ తెరవగానే షాక్..
-
ISRO: ‘‘ఇస్రో ప్రైవేటీకరణ కాదు’’.. ఉద్యోగులకు చైర్మన్ భరోసా..
-
Trump: న్యూ మెక్సికో రాష్ట్రం పేరు మార్చేందుకు ట్రంప్ ప్లాన్.. సాధ్యమేనా? రూల్స్ ఇవే!
-
Bigg Boss 10 Contestants Remuneration: బిగ్‌బాస్ హౌస్‌లో రాంప్రసాద్‌కు కళ్లు చెదిరే రెమ్యూనరేషన్.. మిగిలిన వారికి ఇలా..
-
Vijay DMK Attack: అసెంబ్లీలో సీఎం విజయ్ విశ్వరూపం.. డీఎంకేపై తీవ్రస్థాయిలో ఫైర్..
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!