Site icon NTV Telugu

Mumbai Monorail Breaks Down: ముంబైలో రెండు ముక్కలైన మోనోరైలు.. ఇరుక్కుపోయిన 100 మంది!

Monorail

Monorail

Mumbai Monorail Breaks Down: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కురుస్తున్న భారీ వర్షాలతో రవాణా వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీశాయి. ఈ వర్షాల ధాటికి ఇవాళ ( ఆగస్టు 19న) సాయంత్రం మోనోరైలు సర్వీసులు పూర్తిగా నిలిచిపోయాయి. ఈరోజు సాయంత్రం 6.15 గంటల సమయంలో చెంబూర్‌–భక్తి పార్క్‌ మధ్య రైలు ఆగిపోవడంతో ప్రయాణికులు లోపలే ఇరుక్కుపోయారు. ఈ ఘటనతో తీవ్ర భయాందోళనలకు గురైన ప్యాసింజర్లు వెంటనే బృహన్‌ ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ (BMC) అత్యవసర హెల్ప్‌లైన్‌ నంబర్‌ 1916కి డయల్ చేశారు. దీంతో సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని రక్షణ చర్యలు చేపట్టారు. ఈ ఆపరేషన్‌లో మూడు స్నార్కెల్‌ వాహనాలను ఉపయోగించారు.

Read Also: HHVM : ఓటీటీలోకి వీరమల్లు.. ఎక్కడ, ఎప్పటి నుంచి..?

కాగా, తాజా సమాచారం ప్రకారం, మోనోరైలులో ఇంకా పలువురు ప్రయాణికులు లోపలే ఉన్నారని సమాచారం. ఆ ట్రైన్ లోని ప్యాసింజర్లను బయటకు తీసేందుకు అధికారులు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. అయితే, భారీ వర్షాల కారణంగా ముంబైలో రవాణా సమస్యలు తీవ్రరూపం దాల్చడంతో పౌరులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు, అవసరమైతేనే ప్రజలు బయటకు రావాలని అధికారులు సూచించారు. ఇక, రాబోయే 48 గంటల పాటు ప్రజలకు జాగ్రత్తగా ఉండాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ హెచ్చరించారు.

Exit mobile version