Mumbai Monorail Breaks Down: ముంబైలో రెండు ముక్కలైన మోనోరైలు.. ఇరుక్కుపోయిన 100 మంది!
- ముంబైలో భారీ వర్షాలతో అస్తవ్యస్తమైన రవాణా వ్యవస్థ..
- భారీ వర్షాల దెబ్బకు ఒక్కసారిగా నిలిచిపోయిన మోనోరైలు..
- మోనోరైలులో చిక్కుకున్న ప్రయాణికులు.. కొనసాగుతున్న సహాయక చర్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mumbai Monorail Breaks Down: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కురుస్తున్న భారీ వర్షాలతో రవాణా వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీశాయి. ఈ వర్షాల ధాటికి ఇవాళ ( ఆగస్టు 19న) సాయంత్రం మోనోరైలు సర్వీసులు పూర్తిగా నిలిచిపోయాయి. ఈరోజు సాయంత్రం 6.15 గంటల సమయంలో చెంబూర్–భక్తి పార్క్ మధ్య రైలు ఆగిపోవడంతో ప్రయాణికులు లోపలే ఇరుక్కుపోయారు. ఈ ఘటనతో తీవ్ర భయాందోళనలకు గురైన ప్యాసింజర్లు వెంటనే బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) అత్యవసర హెల్ప్‌లైన్ నంబర్ 1916కి డయల్ చేశారు. దీంతో సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని రక్షణ చర్యలు చేపట్టారు. ఈ ఆపరేషన్‌లో మూడు స్నార్కెల్ వాహనాలను ఉపయోగించారు.
Read Also: HHVM : ఓటీటీలోకి వీరమల్లు.. ఎక్కడ, ఎప్పటి నుంచి..?
Also Read
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
- BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
కాగా, తాజా సమాచారం ప్రకారం, మోనోరైలులో ఇంకా పలువురు ప్రయాణికులు లోపలే ఉన్నారని సమాచారం. ఆ ట్రైన్ లోని ప్యాసింజర్లను బయటకు తీసేందుకు అధికారులు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. అయితే, భారీ వర్షాల కారణంగా ముంబైలో రవాణా సమస్యలు తీవ్రరూపం దాల్చడంతో పౌరులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు, అవసరమైతేనే ప్రజలు బయటకు రావాలని అధికారులు సూచించారు. ఇక, రాబోయే 48 గంటల పాటు ప్రజలకు జాగ్రత్తగా ఉండాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ హెచ్చరించారు.
⚡ Passengers Stuck in Mumbai Monorail:
A monorail train got stuck midway on the tracks near Mysore Colony in Chembur due to a power supply issue amid heavy rains. The fire brigade is carrying out a rescue operation to evacuate the passengers #MumbaiRains pic.twitter.com/5XNMDimXdl
— OSINT Updates (@OsintUpdates) August 19, 2025
తాజావార్తలు
-
Srikanth Odela: “ఎవర్రా నువ్వు.. ఏంది నీ గోల?”.. శ్రీకాంత్ ఓదెల మొండితనం చూసి సుకుమార్ షాక్!
-
Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
-
DK Aruna : ఓటమి భయంతోనే కాంగ్రెస్ డ్రామాలు.. ఎంపీ డీకే అరుణ కీలక వ్యాఖ్యలు..
-
VIVO S60T: 7200mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్ప్లే.. Vivo S60t స్మార్ట్ ఫోన్ లాంచ్..
-
Honor New Mobile: 6000 mAH బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్, 1TB స్టోరేజ్.. Honor X5ds లాంచ్..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!