Site icon NTV Telugu

Mumbai: ముంబైలో కూలిన మెట్రో పిల్లర్.. పలువురికి గాయాలు

Mumbaimetro8

Mumbaimetro8

ముంబైలోని ములుండ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. మెట్రో రైలుకు సంబంధించిన పిల్లర్ కూలిపోయింది. దీంతో పెద్ద ప్రమాదం జరిగింది. రద్దీగా ఉన్న సమయంలో కూలిపోవడంతో అనేక మంది గాయపడ్డారు. పోలీసులు వెంటనే సంఘటనాస్థలికి వెళ్లి క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. సబ్వే స్లాబ్ కూలిపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: Iran Video: ‘‘ఖమేనీ డెత్’’ అంటూ నోరు జారిన రిపోర్టర్.. టీవీ ఛానల్స్ సిబ్బంది తొలగింపు

శనివారం మధ్యాహ్నం 12:20 గంటలకు ములుండ్ (పశ్చిమ)లోని జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ సమీపంలో మెట్రో పిల్లర్ కూలిపోయిందని BMC తెలిపింది. నిర్మాణ సమయంలో సిమెంట్ మెట్రో పిల్లర్ భాగం విరిగి రిక్షాపై పడిందని.. ప్రమాదం జరిగిన వెంటనే ముంబై అగ్నిమాపక దళం, పోలీసులు, మెట్రో సిబ్బంది, వార్డ్ సిబ్బంది, 108 అంబులెన్స్ సర్వీస్ సంఘటనా స్థలానికి చేరుకున్నాయని వెల్లడించింది. ఆటోరిక్షాలో ఉన్న నలుగురు వ్యక్తులు గాయపడినట్లు తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: Trump: ఇరాన్‌లో పాలన మార్పు తథ్యం.. డీల్ కుదరకపోతే జరిగేది అదేనన్న ట్రంప్

 

Exit mobile version