NTV Telugu Site icon

PM Modi: “ఇలాగే జరుగుతూ ఉంటుంది”.. సీఎం సిద్ధరామయ్యతో పీఎం మోడీ..

Pm Modi

Pm Modi

PM Modi: ప్రధాని నరేంద్రమోడీ బెంగళూర్‌లో నెలకొల్పుతున్న కొత్త కొత్త బోయింగ్ ఇండియా ఇంజినీరింగ్ & టెక్నాలజీ సెంటర్ (BIETC) క్యాంపస్ ప్రారంభోత్సవంలో శుక్రవారం పాల్గొన్నారు. 43 ఎకరాల స్థలంలో రూ. 1,600 కోట్లతో నిర్మించిన అత్యాధునిక ఫెసిలిటీని ప్రధాని ప్రారంభించారు. ఆ తర్వాత అక్కడే ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రసంగించారు.

ఇదిలా ఉంటే ప్రధాని మోడీ ప్రసంగం చేస్తున్న సమయంలో ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది. పీఎం తన ప్రభుత్వ విజయాలను వివరిస్తున్న సందర్భంగా సభకు హాజరైన వారు ‘మోడీ మోడీ’ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వేదిక పంచుకున్న కర్ణాటక సీఎం సిద్ధరామయ్యను చూస్తూ..‘‘ ముఖ్యమంత్రి గారు ఇది జరుగుతూనే ఉంటుంది’’ అంటూ చమత్కరించారు. దీంతో సీఎం సిద్ధరామయ్య నవ్వారు.

Read Also: Ayodhya Event: రామ మందిర వేడుక వేళ రూల్స్ ఉల్లంఘించారో AI పట్టేస్తుంది..

43 ఎకరాల స్థలంలో రూ. 1,600 కోట్ల వ్యయంతో నిర్మించిన అత్యాధునిక బోయింగ్ ఇండియా ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ సెంటర్, అమెరికా వెలుపల బోయింగ్ అత్యధిక పెట్టుబడిగా ఉంది. బెంగళూర్ శివార్లలోని దేవనహళ్లిలోని హైటెక్ డిఫెన్స్ మరియు ఏరోస్పేస్ పార్క్‌లో ఉన్న ఈ క్యాంపస్ డైనమిక్ స్టార్టప్‌లతో పాటు భారతదేశంలోని ప్రైవేట్ మరియు ప్రభుత్వ రంగాల కీలకమైన భాగస్వామ్య కేంద్రంగా ఉంది. గ్లోబల్ ఏరోస్పేస్, డిఫెన్స్ పరిశ్రమ కోసం నెక్ట్స్ జనరేషన్ ఉత్పత్తులు, సేవలకు ఇది కేంద్రంగా దోహదపడుతుందని భావిస్తున్నారు. ప్రధాని ‘బోయింగ్ సుకన్య ప్రోగ్రాం’ని కూడా ప్రారంభించబోతున్నారు. ఇది దేశంలో అభివృద్ధి చెందుతున్న విమానయాన రంగంలోకి భారతదేశం అంతటా ఎక్కువ మంది ఆడపిల్లల ప్రవేశానికి తోడ్పడటం లక్ష్యంగా పెట్టుకుంది అని అధికారులు చెప్పారు.