NTV Telugu Site icon

Gangster Shot Dead: ఉత్తర్‌ప్రదేశ్‌లో మరో గ్యాంగ్‌స్టర్ హతం.. కోర్టులోనే కాల్పులు..

Up

Up

Gangster Shot Dead: ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో మరో గ్యాంగ్‌స్టర్ హత్య జరిగింది. మాఫియాడాన్, గ్యాంగ్ స్టర్, ఇటీవల హత్య కేసులో దోషిగా తేలిన ముఖ్తార్ అన్సారీకి అతిముఖ్యమైన సన్నిహితుడిగా పేరొందిని సంజీవ్ మహేశ్వీరీ అలియాస్ సంజీవ్ జీవాను లక్నో కోర్టు ఆవరణలోనే కాల్చి చంపారు. ముజఫర్‌నగర్‌కు చెందిన జీవా 2006లో బీజేపీ ఎమ్మెల్యే కృష్ణానంద్ రాయ్, యూపీ మాజీ మంత్రి బ్రహ్మదత్ ద్వివేది హత్యల కేసులో అరెస్టయ్యాడు. ద్వివేది హత్య కేసులో జీవా, సమాజ్‌వాదీ పార్టీ మాజీ ఎమ్మెల్యే విజయ్‌సింగ్‌లకు జీవిత ఖైదు పడింది. జీవాకు మరో నాలుగు హత్యలతో సంబంధం ఉంది.

Read Also: Speaker Pocharam: కేసీఆర్ తర్వాత కేటీఆరే సీఎం అవుతారు- స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి

కృష్ణానంద్ రాయ్ హత్యలో అన్సారీ సోదరులు( సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ అఫ్జల్ అన్సారీ మరియు ఎమ్మెల్యే ముఖ్తార్ అన్సారీ)లతో పాటు సంజీవ్ జీవా, ఎజాజ్ అన్సారీ, రాయ్ బరేలీకి చెంది ఫిర్దౌస్, మున్నా బజరంగీ పేర్లు ఈ కేసులో ఉన్నాయి. ఈ కేసులోనే జీవాను పోలీసులు కోర్టులో హాజరుపరిచినట్లు తెలుస్తోంది. లాయర్ వేషంలో వచ్చిన వ్యక్తి, జీవాపై కాల్పులు జరిగి చంపేశాడు. ప్రస్తుతం కాల్పులు జరిపిన దుండగుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. దాడికి పాల్పడిన వ్యక్తి ఆరు రౌండ్లు కాల్పులు జరిపాడు. ఈ దాడిలో మరో వ్యక్తికి కూడా గాయాలు అయినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ట్రామా సెంటర్ కు లక్నో పోలీసులు తరలించారు. జీవాపై మొత్తం 22 కేసులు నమోదు అయ్యాయి.

ఈ ఘటనపై ప్రతిపక్ష సమాజ్ వాదీ పార్టీ సీఎం అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని బీజేపీ సర్కార్ పై విమర్శలు ఎక్కుపెట్టింది. లక్నో ‘రక్షణ లేని నగరాల’ జాబితాలో చేరిందని, నగరంలో మహిళలకు భద్రత లేదని ఆయన అన్నారు. లక్నోలో నేరాల పెరుగుదలపై ఆయన పోలీసులు ప్రశ్నించారు. పోలీసుల కస్టడీలోనే ప్రజలు హత్యలకు గురవుతున్నారని, లక్నో సివిల్ కోర్టు వద్ద న్యాయవాదులు నిరసన తెలిపారు. గతంలో ఇలాగే పోలీసుల సమక్షంలోనే గ్యాంగ్ స్టర్ అతీక్ అహ్మద్, అతని సోదరుడిని దుండగులు కాల్చి చంపారు.

Show comments