Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Mukesh Ambani Buys Dubais Costliest Home For Youngest Son Anant

Mukesh Ambani: దుబాయ్‌లో అత్యంత ఖరీదైన ఇంటిని కొనుగోలు చేసిన ముకేష్ అంబానీ!

Published Date :August 29, 2022 , 11:08 am
By Mahesh Jakki
Mukesh Ambani: దుబాయ్‌లో అత్యంత ఖరీదైన ఇంటిని కొనుగోలు చేసిన ముకేష్ అంబానీ!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Mukesh Ambani: ముకేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ దుబాయ్‌లో 80 మిలియన్ల డాలర్ల విలువ గల బీచ్-సైడ్ విల్లాను కొనుగోలు చేసినట్లు సమాచారం. ఇది నగరంలోనే అతిపెద్ద నివాస ప్రాపర్టీ డీల్ అని ఒప్పందం గురించి తెలిసిన ఇద్దరు వ్యక్తులు తెలిపారు. దుబాయ్ కృత్రిమ ఐలాండ్ అయిన పామ్ జుమేరా వద్ద ఉన్న ఈ ప్రాపర్టీని అంబానీ చిన్న కుమారుడు అనంత్ కోసం ఈ సంవత్సరం ప్రారంభంలో కొనుగోలు చేశారు. ఇది ప్రైవేట్ డీల్ కాబట్టి వివరాలు బయటకు రానివ్వలేదు. ఈ బీచ్-సైడ్ మాన్షన్ పామ్ జుమేరా ఐలాండ్‌కు ఉత్తర భాగంలో ఉంది. 10 బెడ్‌రూమ్‌లు, ఒక ప్రైవేట్ స్పా, ఇండోర్, అవుట్‌డోర్ స్విమ్మింగ్ పూల్స్ దీంట్లో ఉన్నాయి. అయితే ఈ ప్రాపర్టీ కొనుగోలుదారులు ఎవరో చెప్పకుండానే లగ్జరీ విల్లాకు సంబంధించిన వివరాలను స్థానిక మీడియా నివేదించింది.

దీర్ఘకాల “గోల్డెన్ వీసాలు” అందించడం ద్వారా, విదేశీయులకు ఇంటి యాజమాన్యంపై పరిమితులను సడలించడం ద్వారా ధనవంతులకు దుబాయ్ ఇష్టమైన మార్కెట్‌గా అభివృద్ధి చెందుతోంది. బ్రిటీష్ ఫుట్‌బాల్ ఆటగాడు డేవిడ్ బెక్‌హామ్ తన భార్య విక్టోరియా, బాలీవుడ్ మెగాస్టార్ షారుక్ ఖాన్ అంబానీకి ఇరుగుపొరుగుగా అవతరించారు. వారికి కూడా అక్కడ నివాసాలు ఉన్నాయి. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం అంబానీకి చెందిన 93.3 బిలియన్ల డాలర్ల సంపదకు ముగ్గురు వారసులలో అనంత్ ఒకరు. 65 ఏళ్ల వయస్సు గల ముకేష్ అంబానీ ప్రపంచంలోని 11వ అత్యంత సంపన్నుడు. తన సామ్రాజ్యాన్ని గ్రీన్ ఎనర్జీ, టెక్, ఇ-కామర్స్‌లో విస్తరించిన వైవిధ్యీకరణ తర్వాత నెమ్మదిగా తన పిల్లలకు పగ్గాలను అప్పగిస్తున్నారు.

Work From Office: ఆఫీసుకు వెళుతున్నాం కదా! ఇంకా ఆ పాత బట్టలేనా? కొనేద్దాం కొత్తవి!!

కుటుంబం విదేశాల్లో తన రియల్ ఎస్టేట్ ఫుట్ ప్రింట్‌ను పెంచుకుంటోంది. ముకేష్ వారసులు రెండో ఇంటి కోసం పశ్చిమ దేశాల వైపు చూస్తున్నారని సమాచారం. గత సంవత్సరం రిలయన్స్ యూకేలో స్టోక్ పార్క్ లిమిటెడ్‌ను కొనుగోలు చేయడానికి 79 మిలియన్ల డాలర్లు వెచ్చించింది. ఇందులో పెద్ద కుమారుడు ఆకాష్ కోసం జార్జియన్ కాలం నాటి భవనం ఉంది. అతను ఇటీవలే టెలికాం ఆపరేటర్ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ ఛైర్మన్‌గా నియమితుడయ్యారు. అతని కవల సోదరి ఇషా న్యూయార్క్‌లో ఓ ఇల్లు కొనుగోలు చేసే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. దుబాయ్ ప్రాపర్టీ డీల్ రహస్యంగా ఉంది. రిలయన్స్‌కు సంబంధించినన ఆఫ్‌షోర్ ఎంటిటీలో ఒకటి ఈ డీల్‌ను నిర్వహిస్తుంది. అంబానీల ప్రాథమిక నివాసం ముంబయిలోని 27 అంతస్తుల ఆకాశహర్మ్యంలో మూడు హెలిప్యాడ్‌లు, 168 కార్ల పార్కింగ్, 50 సీట్ల సినిమా థియేటర్, గ్రాండ్ బాల్‌రూమ్. మ్మిది ఎలివేటర్‌లతో ఉంటుంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Akash Ambani
  • Anant Ambani
  • costliest home in dubai
  • dubai
  • Mukesh Ambani

తాజావార్తలు

  • Bhuvneshwar Kumar: భువనేశ్వర్ కెరీర్‌లో సచిన్ సో స్పెషల్.. దెబ్బకు దశ తిరిగింది!

  • Iran-Israel War: రైల్లో ప్రయాణం చేయొద్దు.. ఇరానీయులకు ఇజ్రాయెల్ హెచ్చరిక

  • Agarbatti Scam: అగరబత్తీల తయారీ పేరుతో రూ. 25 కోట్ల కుచ్చు టోపీ.. జాగ్రత్త సుమీ.!

  • Liquor Shop Holidays: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. ఈ తేదీల్లో వైన్ షాపులు క్లోజ్!

  • Cyber Crime Police Crack Down : సైబర్ దొంగలకు షాక్.. కోట్ల రికవరీ ఎలా సాధ్యమైంది..?

ట్రెండింగ్‌

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions