Relationship Controversy: అందానికి ముగ్ధుడై పిల్లనిచ్చిన అత్తతో ప్రేమలో పడ్డ అల్లుడు.. లేచిపోయి వివాహం
- అత్తతో ప్రేమలో పడ్డ అల్లుడు
- లేచిపోయి వివాహం
- ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ దేహత్ జిల్లాలో అసాధారణ ఘటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ దేహత్ జిల్లాలో చోటుచేసుకున్న ఓ అసాధారణ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీసింది. ఓ అల్లుడు తనకు పిల్లనిచ్చిన అత్త అందానికి ముగ్ధుడై ప్రేమలో పడ్డాడు. చివరకు ఆమెనే పెళ్లాడాడు. కూతురి పెళ్లి తర్వాత అత్తగారింటికి రాకపోకలు సాగించిన అల్లుడు.. అత్తతో ప్రేమలో పడ్డాడు. ఇద్దరి మధ్య వయసు వ్యత్యాసం ఉన్నప్పటికీ.. లోకం ఏమనుకున్నా పర్వాలేదంటూ ఇళ్లనుంచి పారిపోయి మరీ కోర్టులో వివాహం చేసుకున్నారు.
అనంతరం తాము ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకున్నామంటూ కోర్టు సర్టిఫికేట్ తో ఉన్న వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. అది కాస్తా వైరల్ గా మారింది. ఇద్దరూ పరస్పర అంగీకారంతో వివాహం చేసుకున్నట్లు పేర్కొంటున్నారు. వివాహం అనంతరం సోషల్ మీడియాలో విడుదలైన వీడియోలో వారు తమ నిర్ణయాన్ని సమర్థించుకుంటూ, తమ బంధాన్ని గౌరవించాలని, ఆశీర్వదించాలని ప్రజలను కోరారు.
Also Read
- India’s New Time Rule: ISTపై కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. దేశవ్యాప్తంగా కొత్త టైమ్ రూల్స్.. ఎప్పటినుంచంటే?
- Bhopal Murder: భర్త, భార్య, ప్రియురాలు, మాజీ ప్రియుడు.. ఈ హత్య కేసులో ట్విస్టులే ట్విస్టులు!
- NEET PG 2026 Exam: నేడే నీట్ పీజీ 2026 ప్రవేశ పరీక్ష.. అభ్యర్థులు ఈ తప్పులు చేయకండి.. కీలక మార్గదర్శకాలు
- Mohan Bhagwat: ‘భారత్లో ముస్లింలు ఉండకూడదనేవారు హిందువులే కాదు’.. మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
స్థానికంగా చర్చనీయాంశం
ఈ ఘటన వెలుగులోకి రావడంతో స్థానికంగా విస్తృత చర్చ జరుగుతోంది. మహిళ, ఆమె అల్లుడు చాలా కాలంగా సన్నిహితంగా ఉన్నారని కొందరు స్థానికులు పేర్కొంటున్నప్పటికీ, ఈ వాదనలకు సంబంధించి అధికారిక ధృవీకరణ లేదు. ఈ వ్యవహారం కుటుంబ సభ్యులను, బంధువులను ఆశ్చర్యానికి గురి చేసింది. సంప్రదాయ కుటుంబ విలువలు, సామాజిక సంబంధాల నేపథ్యంలో ఈ ఘటనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
సోషల్ మీడియాలో భిన్న స్పందనలు
ఈ ఘటనపై సోషల్ మీడియా వేదికల్లో విభిన్న స్పందనలు కనిపిస్తున్నాయి. కొందరు దీనిని వ్యక్తిగత నిర్ణయంగా అభివర్ణిస్తుండగా, మరికొందరు సామాజిక, కుటుంబ పరమైన కోణాల్లో ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. వైరల్ వీడియో కారణంగా ఈ విషయం స్థానిక స్థాయిని దాటి రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. నెటిజన్లు వీడియోను విస్తృతంగా షేర్ చేస్తూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
తాజావార్తలు
-
India’s New Time Rule: ISTపై కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. దేశవ్యాప్తంగా కొత్త టైమ్ రూల్స్.. ఎప్పటినుంచంటే?
-
Billionaire Web Series: విజయ్ మాల్యా కథతో అర్జున్ రాంపాల్.. నవంబర్లో షూటింగ్
-
Bhakthi Anniversary Special: రెండు దశాబ్దాల ఆధ్యాత్మిక ప్రయాణం.. భక్తి టీవీ ప్రత్యేక గీతం మీకోసం.!
-
GV Prakash : సుధా కొంగర సినిమాకు నో చెప్పిన మహేశ్ బాబు
-
Bhopal Murder: భర్త, భార్య, ప్రియురాలు, మాజీ ప్రియుడు.. ఈ హత్య కేసులో ట్విస్టులే ట్విస్టులు!
ట్రెండింగ్
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!