Madhya Pradesh: ప్రాణాలు తీసిన వదంతి.. రైలు నుంచి దూకిన ప్రయాణికుల్ని ఢీకొట్టిన మరో రైలు..
- మధ్యప్రదేశ్‌లో ఘోర రైలు ప్రమాదం..
- రైలులో మంటల వదంతులు..
- రైలు నుంచి దూకిన ప్రయాణికుల్ని ఢీకొట్టిన మరో రైలు,..
- నలుగురు ప్రయాణికులు మృతి, పలువురికి గాయాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Madhya Pradesh: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఆదివారం సాయంత్రం ఘోర ప్రమాదం జరిగింది. రైలులో వ్యాపించిన పుకారు నలుగురు ప్రాణాలను తీసింది. మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది. ఉదయ్‌పూర్ ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగాయనే వదంతులు వ్యాపించడంతో, భయపడిన ప్రయాణికులు రైలు నుంచి బయటకు దూకారు. ఇదే సమయంలో వేరే ట్రాక్‌పై వస్తున్న రైలు వీరిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మరణించారు.
ఉదయ్‌పూర్ ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్ మోరేనా జిల్లాలోని హేతంపూర్ స్టేషన్‌కు సమీపిస్తున్న సమయంలో, రైలుకు మంటలు వ్యాపించాయనే పుకారు వ్యాపించింది. ఈ విషయంతో ఒక్కసారిగా భయాందోళనకు గురైన ప్రయాణికులు ప్రాణాలు కాపాడుకునేందుకు రైలు నుంచి పట్టాలపై దూకారు. ఇదే సమయంలో పక్క ట్రాక్‌పై నుంచి వస్తున్న పాతాళ్‌లోక్ ఎక్స్‌ప్రెస్ వేగంగా వీరిని ఢీకొట్టింది. రెప్పపాటు క్షణాలలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సంఘటనా స్థలానికి అధికారులు, జిల్లా యంత్రాంగం చేసుకుని, సహాయక చర్యలు ప్రారంభించింది.
Also Read
ఈ ఘటనపై అధికారులు విచారణ ప్రారంభించారు. ఈ పుకారు ఎక్కడి నుంచి వ్యాపించింది.? ఉద్దేశపూర్వకంగా వ్యాప్తి చేశారా? అనే కోణంలో విచారణ జరుగుపుతున్నారు. ప్రయాణికులు చెబుతున్న దాని ప్రకారం.. అకస్మాత్తుగా ఎవరో చైన్ లాగి మంటలు అని అరిచినట్లు చెప్పారు. దీంతో జనం రైలు దిగారని, ప్రయాణికులు పట్టాలు దాటుతుండగా, మరో రైలు వీరిని ఢీకొట్టినట్లు చెప్పారు. చనిపోయిన వారు ఒకే కుటుంబానిక చెందిన వారిగా గుర్తించారు. కుటుంబంలోని భార్యభర్తలు, ఇద్దరు పిల్లలు మరణించారు.
తాజావార్తలు
-
Child Safety Tips : స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయి.. పిల్లలకు ఈ 5 ‘అబద్ధాలు’ నేర్పించండి..!
-
Madhya Pradesh: ప్రాణాలు తీసిన వదంతి.. రైలు నుంచి దూకిన ప్రయాణికుల్ని ఢీకొట్టిన మరో రైలు..
-
Women’s T20 World Cup: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. టీమిండియా జట్టులో కీలక మార్పులు..
-
PM Modi: భారత్ రండి, మాతో కలిసి పని చేయండి.. మోడీ పిలుపు..
-
Vijay Deverakonda: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న విజయ్ దేవరకొండ.. రష్మికతో కలిసి సొంత ఊరిలో 180 మంది విద్యార్థులకు ‘పెళ్లి కానుక’!
ట్రెండింగ్
-
Cleaning Hacks : పరుపు, దిండు నుంచి వాసన వస్తోందా.? ఈ ఒక్క చిట్కాతో నిమిషాల్లో ఫ్రెష్.!
-
Kitchen Tips : బియ్యాన్ని ఇలా కడగకపోతే అన్నం రుచి, ఆరోగ్యం రెండూ దెబ్బే.!
-
Rahamathullah Gurbaj: నా సెంచరీకి కారణం గౌతమ్ గంభీర్.. అఫ్గాన్ ఓపెనర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Rahmanullah Gurbaz Record: జట్టు ఓడిపోయినప్పటికీ రహ్మనుల్లా గుర్బాజ్ చరిత్ర.. క్రికెట్లోనే సరికొత్త మైలురాయి!
-
Nitish Kumar Reddy: అమ్మతో అట్లుంటది మరి.. ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా ఆపేసిన నితీష్ రెడ్డి.. వీడియో వైరల్!