Site icon NTV Telugu

Punjab: పంజాబ్‌లో భారీగా పంట వ్యర్థాల కాల్చివేత.. పెరిగిన వాయు కాలుష్యం

Punjab

Punjab

Punjab: పంజాబ్‌ రాష్ట్రంలో ఆదివారం ఒక్కరోజున 400కి పైగా పంట వ్యర్థాలు తగుల బెట్టారు. ఈ సీజన్‌లో పంజాబ్ లో కేసుల సంఖ్య 8,404కి చేరిపోయింది. రిమోట్ సెన్సింగ్ డేటా సాయంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఇక, పంజాబ్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ అధికారులు మీడియాతో మాట్లాడుతూ.. కొత్తగా 404 వరకూ పంట వ్యర్థాలు తగులబెట్టిన ఘటనలు వెలుగులోకి వచ్చాయని వెల్లడించారు. వాటిలో ఫిరోజ్‌పూర్‌లో 74, భటిండాలో 70, ముక్త్‌సర్‌లో 56, మోగాలో 45, ఫరీద్‌కోట్‌లో 30 ఘటనలు జరిగినట్లు పేర్కొన్నారు. ఫిరోజ్‌లో అత్యధికంగా పంట వ్యర్థాలను తగుల బెట్టిన ఘటనలు చోటు చేసుకోవడం బాధకరం అన్నారు. కాగా, పంజాబ్‌లో 2022లో ఒకే రోజులో 966, 2023లో 1155 పంట వ్యర్థాలు తగుల బెట్టిన కేసులు నమోదైనట్లు పోలీసులు చెప్పుకొచ్చారు.

Read Also: AlluArjun : గుంటూరుకారం ట్రైలర్ వ్యూస్.. రికార్డు బద్దలు కొట్టిన పుష్ప -2

కాగా, గత సెప్టెంబరు 15 నుంచి నవంబర్ 17 వరకు పంజాబ్‌లో 8,404 పంట వ్యర్థాలను తగలబెట్టారు. గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే ఇలాంటి సంఘటనలలో 75 శాతం తగ్గుదల కనబడుతుంది. పంజాబ్, హర్యానాలలో అక్టోబర్‌, నవంబర్‌లలో వరి పంట కోసిన తర్వాత భారీ ఎత్తున పంట వ్యర్థాలు తగలబెడుతుంటం సహజం. కానీ, ఢిల్లీతో పాటు చుట్టు పక్కల ప్రాంతాల్లో వాయు కాలుష్యం పెరగడానికి కారణం అవుతుంది.

Exit mobile version