Heavy Rains: దేశవ్యాప్తంగా భారీ వర్షాలు.. కర్ణాటక, తెలంగాణలో రెడ్ అలర్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. చాలా రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో చాలా ప్రాంతాలు నీటమునిగాయి. వరదలు పోటెత్తి అనేక మంది గల్లంతయ్యారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, గుజరాత్ ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం పడుతోంది. మహారాష్ట్రలో భారీ వర్షాల కారణంగా గడ్చిరౌలి జిల్లాలోని 130 గ్రామాలకు మధ్య సంబంధాలు తెగిపోయాయి. మరో వైపు నాందేడ్, హింగోలి జిల్లాల్లో కూడా భారీ వర్షాలు పడుతున్నాయి. కర్ణాటక, తెలంగాణలో రెడ్ అలర్ట్‌లు జారీ చేశారు.
రాబోయే ఐదు రోజుల పాటు భారతదేశంలోని అనేక రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. దేశ మధ్య, పశ్చిమ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. ఇక ఢిల్లీ, పంజాబ్, హర్యానా, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, ఒడిశా, గోవా, మహారాష్ట్రలోని మరట్వాడ, ఛత్తీస్గడ్, మధ్య ప్రదేశ్, కేరళ, కర్ణాటకల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు పేర్కొంది. హరియాణా, పంజాబ్, ఉత్తరప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువగా వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. ఇప్పటికే ఉత్తరప్రదేశ్‌లో పిడుగుల కారణంగా ఐదుగురు చనిపోయారు. హిమాచల్ ప్రదేశ్‌లోని కులూ, చంబా జిల్లాల్లో మెరుపు వరదలు వచ్చాయి. ఈ ఘటనలో ప్రాణనష్టం చోటుచేసుకోలేదు.
Also Read
- Marriage Dispute: నాకు 41 ఏళ్లు సర్.. అయినా మా ఇంట్లో పెళ్లి చేయడం లేదు.. పోలీసులను ఆశ్రయించిన మహిళ
- K Annamalai: "కొత్త రాజకీయ ఉద్యమం మొదలు పెడుతున్నా".. అన్నామలై సంచలన ప్రకటన..
- Green SM Limo: ఓలా-ఉబర్‌లకు పోటీగా కొత్త కంపెనీ.. బుకింగ్‌పై ఏకంగా 50% బంపర్ డిస్కౌంట్!!
- K Annamalai: బీజేపీకి అన్నామలై గుడ్‌బై.. రాజీనామాను ఆమోదించిన నితిన్ నబిన్
తెలంగాణలో భారీ వర్షాలు.. ఏ జిల్లాలో ఎంత వర్షపాతమంటే..?
ముంబై, థానే, మహారాష్ట్రలోని ఇతర ప్రాంతాలకు రాబోయే ఐదు రోజుల పాటు భారీ వర్షపాతం నమోదవుతుందని ముంబై ప్రాంతీయ వాతావరణ కేంద్రం బుధవారం హెచ్చరిక జారీ చేసింది. జులై 10 వరకు ముంబై, థానేలలో ఆరెంజ్ అలర్ట్ కూడా ప్రకటించింది.మహారాష్ట్రలోని పలు నదులు ప్రమాద స్థాయికి చేరుకున్నాయి. కుండలికా నది హెచ్చరిక స్థాయిని దాటడంతో అంబా, సావిత్రి, పాతాళగంగ, ఉల్హాస్, గర్హి నదుల నీటిమట్టం హెచ్చరిక స్థాయి కంటే కాస్త తక్కువగా ఉంది. ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే అన్ని జిల్లాలను అప్రమత్తం చేసి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. అస్సాంలో వరదలు ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతున్నాయి. ఆ రాష్ట్రంలోని అన్ని నదలు ప్రమాదస్థాయికి దిగువనే ప్రవహిస్తున్నాయి. ఇక్కడ వరదల కారణంగా 6లక్షలకు పైగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అస్సాం రాష్ట్ర విపత్తు నిర్వహణ విభాగం పేర్కొంది.
తాజావార్తలు
-
Jhanvi Kapoor : ఇన్‌స్టాగ్రామ్‌లో పెద్ది నెగిటివ్ రివ్యూ పోస్ట్‌ను లైక్ చేసిన జాన్వీ.. ఫీలైనట్టుంది?
-
Rama Nandana: లగ్జరీ లైఫ్‌స్టైల్ వెనుక “గలీజ్ దందా”.. యూట్యూబర్ రమానందన, మధుకర్‌కు లుకౌట్ నోటీసులు!
-
OnePlus Community Sale 2026: వన్‌ప్లస్ కమ్యూనిటీ సేల్ ప్రారంభం.. ఫ్లాగ్షిప్ ఫోన్లు, ట్యాబ్లెట్లపై భారీ డిస్కౌంట్లు
-
KS Bharat Retirement: ఇట్స్ అఫీషియల్.. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తెలుగు క్రికెటర్
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
ట్రెండింగ్
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్‌లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్..