Site icon NTV Telugu

Mohan Bhagwat: విద్య, ఆరోగ్యం సామాన్యుడికి దూరమయ్యాయి. మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు

Mohanbhagwat

Mohanbhagwat

విద్య, ఆరోగ్యంపై ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండోర్‌లో ఆయన మాట్లాడుతూ.. విద్య, ఆరోగ్యం.. ఈ రెండూ కూడా సామాన్యుడికి దూరమైపోయాయని తెలిపారు. గతంలో ఈ రెండింటిని సేవగా భావించేవారని.. కానీ ఇప్పుడు వాణిజ్యంగా మారిపోయాయని ఆరోపించారు. ఈ రెండు సామాన్యుడికి అవసరం.. కానీ అందుబాటులో లేవన్నారు. అందనంత దూరంలో ఉన్నాయని చెప్పారు.

ఇది కూడా చదవండి: WAR 2 Pre Release Event : వార్-2 ఈవెంట్ లో అడుగు పెట్టిన హృతిక్, ఎన్టీఆర్

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో మోహన్ భగవత్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసగించారు. గతంలో ఆరోగ్య సంరక్షణ, విద్య సేవా స్ఫూర్తితో నడిచేవని.. ఇప్పుడెందుకు వ్యాపారంగా మారాయో అర్థం కావడం లేదన్నారు. పశ్చిమ దేశాలు ఏకరీతి ఆరోగ్య సంరక్షణ ప్రమాణాలు పాటిస్తాయని.. భారతీయ వైద్యం మాత్రం రోగులకు వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా చికిత్స అందిస్తారని తెలిపారు.

ఇది కూడా చదవండి: UP: ప్రియుడిని ఇంటికి పిలిచి భర్తతో కలిసి చంపేసిన ప్రియురాలు.. అసలేమైందంటే..!

Exit mobile version