Mohan Bhagwat: జెన్-జీతో దేశద్రోహులైపోతారా? నిరసనలో తప్పేముంది? మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
- యువతపై మోహన్ భాగవత్ కీలక వ్యాఖ్యలు
- జెన్-జీతో దేశద్రోహులైపోతారా?
- నిరసనలో తప్పేముంది?
- రాజకీయ వర్గాల్లో ఆర్ఎస్ఎస్ చీఫ్ వ్యాఖ్యలు చర్చ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నీట్ పేపర్ లీకేజీపై విద్యార్థులు చేపట్టిన ఉద్యమం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దేశ రాజధాని ఢిల్లీ జంతర్ మంతర్ వేదికగా పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సి వచ్చింది. ఇక ఈ ఉద్యమంపై పెద్ద ఎత్తున చర్చోపచర్చలు జరిగాయి.

Also Read
- Modi-Netanyahu: మోడీకి నెతన్యాహు ఫోన్.. ఉద్రిక్తతల వేళ కీలక సంభాషణ
- West Bengal: మసీదు లౌడ్‌స్పీకర్లపై బెంగాల్లో రగడ.. అమిత్ షా ముందు పంచాయతీ..
- Raksha Bandhan 2026: రక్షా బంధన్ 2026 ఎప్పుడు..? రాఖీ కట్టేందుకు శుభ ముహూర్తం.. గ్రహణం ప్రభావం ఉంటుందా?
- India-Meta: మా చట్ట ప్రకారం నడవాల్సిందే.. మెటాకు కేంద్రం వార్నింగ్
తాజాగా ఇదే అంశంపై ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. నిరసనలు చేస్తున్నారనే కారణంతో జెన్-జీ (Gen Z) యువతను దేశద్రోహులుగా ముద్ర వేయడం సరైంది కాదని స్పష్టం చేశారు. వాళ్లంతా మన దేశ భవిష్యత్తు అని.. వాళ్లంతా మనవాళ్లేనని, వారి సమస్యలను వినడం, పరిష్కరించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని హితవు పలికారు. ప్రపంచంలోనే అతిపెద్ద యువత ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశాల్లో ఒకటిగా పేర్కొంటున్న ‘ది రోల్ ఆఫ్ యూత్ ఇన్ యూనైటింగ్ ది వరల్డ్, ది ఇండియన్ వే’ సదస్సులో మోహన్ భాగవత్ పాల్గొని ఈ వ్యాఖ్యలు చేశారు.
‘‘జెన్ జీ యువత ఆందోళనలు చేస్తుంటే వారు దేశ వ్యతిరేకులు కారు. వారు మనవాళ్లే.. మన తర్వాతి తరం. వారు ఎందుకు నిరసనలు వ్యక్తం చేస్తున్నారో తెలుసుకుని, వారి ఆందోళనలను పరిష్కరించాలి.’’ అని అన్నారు. అయితే ప్రజాస్వామ్యంలో నిరసన వ్యక్తం చేయడానికి కూడా కొన్ని పద్ధతులు, నియమాలు ఉంటాయని సూచించారు. యువత అసలు నిరసనలు చేయకూడదని తాను చెప్పడం లేదని.. కానీ ప్రజాస్వామ్యంలో నిరసన తెలియజేయడానికి ఒక విధానం ఉంటుందని.. ఆ మార్గంలోనే తమ అభిప్రాయాలను వెల్లడించాలని మోహన్ భాగవత్ పేర్కొన్నారు.
ఇటీవల ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఆధ్వర్యంలో జరిగిన విద్యార్థుల నిరసనలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆ నిరసనల అనంతరం కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. ఈ పరిణామాల మధ్య యువత ఆందోళనలపై మోహన్ భాగవత్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి.
తాజావార్తలు
-
AAA Cinemas Vizag: ఈసారి పుష్పరాజ్‌ని కలవడం కష్టమే.. వైజాగ్ AAA ఓపెనింగ్‌కు ఫ్యాన్స్‌కు నో ఎంట్రీ!
-
Shahid Kapoor: అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు క్రేజీ న్యూస్! AA23లో ఆ బాలీవుడ్ హీరో ఎంట్రీ?
-
Cyber Crime: సైబర్ క్రైమ్ పనితీరులో మొదటి స్థానంలో తెలంగాణ.. 9 కీలక అంశాల్లో అగ్రగామిగా..
-
Plastic Chair Cleaning Tips: తెల్లటి ప్లాస్టిక్ కుర్చీలపై మొండి మరకలా? వంటింట్లో ఉన్న పదార్థాలతోనే ఈజీ క్లీనింగ్
-
Arun Matheswaran: స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్‌ను హీరోగా ఎలా ఒప్పించాడో చెప్పిన డీసీ డైరెక్టర్!
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్‌కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్‌లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!