Site icon NTV Telugu

Modi-putin: పుతిన్‌ను స్వయంగా స్వాగతించనున్న మోడీ.. ఒకే కారులో ప్రయాణం.!

Modi Putin

Modi Putin

Modi-putin: రష్యా అద్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మరికాసేపట్లో భారత్‌లో ల్యాండ్ కాబోతున్నారు. డిసెంబర్ 4-5 తేదీల్లో ఆయన భారత్ పర్యటించనున్నారు. ఇప్పటికే, భారత ప్రభుత్వం పర్యటన కోసం అత్యున్నత ఏర్పాట్లను చేసింది. పుతిన్ రాకతో ఢిల్లీ వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. పుతిన్ బస చేసే హోటల్, సందర్శించే ప్రాంతాలను భారత భద్రతా అధికారులతో పాటు రష్యన్ సెక్యూరిటీ అధికారులు పర్యవేక్షిస్తున్నారు.

Read Also: Pakistan: విమాన సంస్థను అమ్ముతున్న పాక్ ప్రభుత్వం.. కొనుగోలు చేయనున్న పాక్ ఆర్మీ.. ఇదే వింత..

ఇదిలా ఉంటే, పుతిన్ ప్రయాణిస్తున్న విమానం ఇప్పటికే భారత ఎయిర్ స్పేస్ లోకి ప్రవేశించింది. మరికొన్ని గంటల్లో ఆయన విమానం ల్యాండ్ కాబోతోంది. అయితే, పుతిన్‌ను రిసీవ్ చేసుకునేందుకు ప్రధాని నరేంద్రమోడీ స్వయంగా ఎయిర్‌పోర్టుకు వెళ్లబోతున్నట్లు సంబంధిత వర్గాలు చెప్పాయి. ఇద్దరు నేతలు ఒకే కారులో ప్రయాణించనున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది చైనాలో జరిగిన ఎస్‌సీఓ సమ్మిట్‌లో ప్రధాని మోడీతో కలిసి, పుతిన్ తన కారులో ప్రయాణించారు. దాదాపుగా 40 నిమిషాల పాటు వీరిద్దరు ఒకే కారులో ప్రయాణించడం విశేషం. ఆ సమయంలో దీనిని ప్రపంచ మీడియా ఎంతో ఆసక్తిగా కవర్ చేసింది.

Exit mobile version