Site icon NTV Telugu

PM Modi: నేడు బీహార్, బెంగాల్‌లో మోడీ పర్యటన.. పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభోత్సవం

Modi

Modi

బీహార్, పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ఈ ఏడాది చివరిలో బీహార్‌.. వచ్చే ఏడాది పశ్చిమ బెంగాల్‌లో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లో అధికారం కోసం బీజేపీ ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగానే ఈరోజు ప్రధాని మోడీ బీహార్, పశ్చిమ బెంగాల్‌లో పర్యటించనున్నారు.

ఇది కూడా చదవండి: T20 World Cup: తొలి మ్యాచ్‌లో భారత్‌తో.. ఫైనల్‌లో ఆస్ట్రేలియాతో! ఇప్పటికీ నమ్మలేకపోతున్నా

శుక్రవారం పశ్చిమబెంగాల్‌లో రూ.5,000 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. పశ్చిమ బర్ధమాన్‌ జిల్లాలోని దుర్గాపూర్‌ పట్టణంలో బీజేపీ చేపట్టిన భారీ ర్యాలీలోనూ మోడీ పాల్గొని ప్రసంగించనున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌–మే నెలలో పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే మోడీ బెంగాల్‌పై ఫోకస్ పెట్టారు.

ఇది కూడా చదవండి: Husband Suicide: ప్రియుడి మోజులో భార్య.. సెల్ఫీ వీడియో రికార్డు చేసి భర్త ఆత్మహత్య..

పశ్చిమ బెంగాల్ పర్యటన తర్వాత బీహార్‌లోనూ మోడీ పర్యటించనున్నారు. రూ.7,000 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నా రు. ఈస్ట్‌ చంపారన్‌ జిల్లాలోని మోతిహరీ పట్టణంలోని గాంధీ మైదాన్‌లో భారీ బహిరంగ సభలో మోడీ పాల్గొంటారు. రూ.4,079 కోట్లతో పూర్తి చేసిన దర్భాంగా– నార్కాటియాగంజ్‌ 256 కిలోమీటర్ల రైల్వేలైన్‌ డబ్లింగ్‌ను మోడీ జాతికి అంకితం చేయనున్నారు.

బీహార్‌లో అక్టోబర్ లేదా నవంబర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. త్వరలో ఓటర్ల తుది జాబితాను ప్రకటించనుంది. ఈ ప్రకటన వచ్చిన రెండు, మూడు రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ రానుంది. ఇండియా కూటమి-ఎన్డీఏ కూటమి మధ్య ఫైటింగ్ నడుస్తోంది. ఈ సారి ప్రజలు ఏ కూటమికి అధికారం కట్టబెడతారో చూడాలి.

Exit mobile version