Modi-Trump: మోడీకి ట్రంప్ ఫోన్.. ఏం మాట్లాడారంటే..!

  • ప్రధాని మోడీకి ట్రంప్ ఫోన్
  • ఇద్దరి మధ్య కీలక సంభాషణ
  • ఎక్స్‌లో వెల్లడించిన రాయబారి సెర్గియో గోర్
Moditrump

Moditrump

మధ్యప్రాచ్యం ఉద్రిక్తతల వేళ ప్రధాని మోడీకి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఫోన్ చేశారు. ఈ సందర్భంగా ఇద్దరి నాయకుల మధ్య కీలక సంభాషణ జరిగింది. హార్ముజ్ జలసంధి, పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలపై ఇరువురి మధ్య సంభాషణ జరిగినట్లుగా భారత్‌లో అమెరికా రాయబారి సెర్గియో గోర్ ఎక్స్‌లో వెల్లడించారు.

గత నెల 28న ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా దాడి చేశాయి. ఈ ఘటనలో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హతమయ్యారు. అనంతరం ఇరాన్ ప్రతీకార దాడులతో చెలరేగిపోయింది. గల్ఫ్ ఇంధన క్షేత్రాలపై క్షిపణులతో విరుచుకుపడింది. అంతేకాకుండా హార్ముజ్ జలసంధిని మూసేసింది. దీంతో ప్రపంచ దేశాల్లో చమురు, గ్యాస్ సంక్షోభం తలెత్తింది. ఈ నేపథ్యంలో ప్రధాన మోడీకి ట్రంప్ ఫోన్ చేసి చర్చించారు.

మోడీ ఏమన్నారంటే…
‘‘అధ్యక్షుడు ట్రంప్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. పశ్చిమ ఆసియాలోని పరిస్థితిపై మంచి అభిప్రాయాలను పంచుకున్నాం. వీలైనంత త్వరగా ఉద్రిక్తతలను తగ్గించి.. శాంతిని పునరుద్ధరించడానికి భారతదేశం మద్దతు ఇస్తుంది. హార్ముజ్ జలసంధి తెరిచి.. సురక్షితంగా అందుబాటులో ఉండేలా చూడటం ప్రపంచం మొత్తానికి అత్యవసరం. శాంతి, స్థిరత్వం దిశగా చేపట్టే ప్రయత్నాల గురించి సంప్రదింపులు కొనసాగించాలని మేము అంగీకరించాం.’’ అని మోడీ రాసుకొచ్చారు.