Site icon NTV Telugu

PM Modi: బీజేపీ కొత్త అధ్యక్షుడి పిల్లలతో మోడీ సంభాషణ.. వీడియో వైరల్

Modi

Modi

బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబిన్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో ప్రధాని మోడీ, కేంద్రమంత్రులు, కుటుంబ సభ్యుల సమక్షంలో నితిన్ నబిన్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా స్వయంగా ప్రధాని మోడీ.. కొత్త అధ్యక్షుడికి స్వీట్లు తినిపించి స్వాగతం పలికారు.

ఇది కూడా చదవండి: Gold Rates: మగువలకు బిగ్ షాక్.. కొత్త రికార్డ్ సృష్టించిన గోల్డ్ ధర

పార్టీ కార్యాలయానికి కొత్త అధ్యక్షుడు నితిన్ నబిన్ కుటుంబ సభ్యులు వచ్చారు. ఈ సందర్భంగా నితిన్ నబిన్ పిల్లలతో ప్రధాని మోడీ కొద్దిసేపు కాలాక్షేపం చేశారు. ఇక కుమార్తె మారం చేయడంతో కొత్త అధ్యక్షుడు భుజంపైకి ఎక్కించుకున్నారు. దీంతో అక్కడే ప్లేట్‌లో ఉన్న స్వీట్లను మోడీ తీసుకుని చిన్నారులకు ఇచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

నితిన్ నబిన్..
చిన్న వయసులో అధ్యక్ష స్థాయికి ఎదిగిన ఘనత నితిన్‌ నబిన్‌(45)కే దక్కింది. నితిన్ నబిన్ 1980లో రాంచీలో జన్మించారు. తండ్రి కిశోర్ ప్రసాద్ సిన్హా మరణించాక 2006లో రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఆ ఏడాది జరిగిన ఉప ఎన్నికల్లో పాట్నా వెస్ట్ అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం వరుసగా బంకిపూర్ అసెంబ్లీ నుంచి 2010, 2015, 2020, 2025 ఎన్నికల్లో విజయం సాధించారు. ఆర్ఎస్ఎస్ నుంచి అంచెలంచెలుగా ఎదిగారు. డిసెంబర్ 14న కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆయనకే పార్టీ పగ్గాలు అప్పగించవచ్చని ప్రచారం జరిగింది. చివరికి అదే నిజమైంది. ఇక అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించాక అనేక సవాళ్లు ఉన్నాయి. త్వరలోనే పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలు నితిన్ నబిన్‌కు తొలి పరీక్ష కానుంది.

 

Exit mobile version