NTV Telugu Site icon

PM Modi: “మోడీ భయపడేవాడు కాదు”.. కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగిన ప్రధాని..

Pm Modi

Pm Modi

PM Modi: ఈ ఏడాది ఛత్తీస్‌గఢ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడీ ఈ రోజు ఛత్తీస్‌గఢ్‌ పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో దాదాపు రూ.7,600 కోట్ల విలువైన ఎనిమిది ప్రాజెక్టులకు మంత్రి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రధాని మోడీ. ‘మోడీ భయపడేవాడు కాదు’ అని అన్నారు. కాంగ్రెస్ ఎంత ప్రయత్నించినా నేను వెనకడుగు వేయను అని.. ఛత్తీస్‌గఢ్ సంక్షేమం, అభివృద్ధి కోసం కాంగ్రెస్ చేసిన దాని కన్నా రెట్టింపు చేశామని, పేదలకు కాంగ్రెస్ పార్టీ శతృవని అన్నారు. ఛత్తీస్‌గఢ్‌ అభివృద్ధిలో కాంగ్రెస్ అడ్డుగోడల నిలుస్తోందని.. ఇది మీ హక్కుల్ని లాగేసుకుంటుందని విజయ్ సంకల్ప్ మహార్యాలీలో ప్రధాని ఆరోపించారు.

Read Also: Karnataka Shakti Scheme: కర్నాటకలో ఉచిత బస్సు టిక్కెట్టు కోసం బురఖా వేసుకున్న వ్యక్తి.. ఎలా పట్టుకున్నారంటే?

ఛత్తీస్‌గఢ్ మార్పు గాలి వీస్తుందని అన్నారు. కాంగ్రెస్ ఛత్తీస్‌గఢ్ ని నాశనం చేసిందని ఆయన అన్నారు. కాంకేర్ జిల్లాలోని అంతఘర్ మరియు రాయ్‌పూర్ మధ్య కొత్త రైలును ప్రధాని మోదీ వాస్తవంగా జెండా ఊపి ప్రారంభించారు. రాష్ట్రంలోని లబ్ధిదారులకు కేంద్రం ఆయుష్మాన్ భారత్ పథకం కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. కొత్త ప్రాజెక్టులు రాష్ట్ర ప్రజలకు విస్తారమైన ఉపాధి అవకాశాలను కల్పిస్తాయని, ప్రజల జీవితాలను మరింత సులభతరం చేస్తాయని అన్నారు. గిరిజన ప్రజలకు సౌకర్యాలు, అభివృద్ధి కనిపిస్తాయని అన్నారు.

అంతకుముందు ప్రధాని సభకు వస్తూ ముగ్గురు బస్ ప్రమాదంలో మరణించారు. వారి గురించి మాట్లాడుతూ.. ఈ ప్రమాదంలో మరణించిన వారికి నివాళులు అర్పించారు. గాయపడిన వారికి చికిత్స కోసం అన్ని విధాల సహాయం అందచేస్తానని తెలిపారు. 2019లో రెండోసారి ప్రధానిగా ఎన్నికైన తర్వాత ఛత్తీస్ గఢ్ కు ప్రధాని రావడం ఇది రెండోసారి. ఈ ఏడాది చివర్లో ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఈ సారి చత్తీస్ గఢ్ లో అధికారంలోకి రావాలని బీజేపీ ప్లాన్ చేసింది. వరసగా మూడు సార్లు 15 ఏళ్ల పాటు ఈ రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉంది. 2018 ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది.