PM Modi: “మోడీ భయపడేవాడు కాదు”.. కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగిన ప్రధాని..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: ఈ ఏడాది ఛత్తీస్‌గఢ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడీ ఈ రోజు ఛత్తీస్‌గఢ్ పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో దాదాపు రూ.7,600 కోట్ల విలువైన ఎనిమిది ప్రాజెక్టులకు మంత్రి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రధాని మోడీ. ‘మోడీ భయపడేవాడు కాదు’ అని అన్నారు. కాంగ్రెస్ ఎంత ప్రయత్నించినా నేను వెనకడుగు వేయను అని.. ఛత్తీస్‌గఢ్ సంక్షేమం, అభివృద్ధి కోసం కాంగ్రెస్ చేసిన దాని కన్నా రెట్టింపు చేశామని, పేదలకు కాంగ్రెస్ పార్టీ శతృవని అన్నారు. ఛత్తీస్‌గఢ్ అభివృద్ధిలో కాంగ్రెస్ అడ్డుగోడల నిలుస్తోందని.. ఇది మీ హక్కుల్ని లాగేసుకుంటుందని విజయ్ సంకల్ప్ మహార్యాలీలో ప్రధాని ఆరోపించారు.
Also Read
- Rahul Gandhi: ‘‘రాహుల్ గాంధీ భయపడ్డారు’’.. అఖిలేష్ హామీతో రాయ్‌బరేలీలో పోటీ..
- Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
- Flydubai Attack: ‘‘ప్రార్థన చేస్తూ వెనక నుంచి దాడి’’.. సంచలన విషయాలు చెప్పిన స్మిత్ మచ్చర్
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ఛత్తీస్‌గఢ్ మార్పు గాలి వీస్తుందని అన్నారు. కాంగ్రెస్ ఛత్తీస్‌గఢ్ ని నాశనం చేసిందని ఆయన అన్నారు. కాంకేర్ జిల్లాలోని అంతఘర్ మరియు రాయ్‌పూర్ మధ్య కొత్త రైలును ప్రధాని మోదీ వాస్తవంగా జెండా ఊపి ప్రారంభించారు. రాష్ట్రంలోని లబ్ధిదారులకు కేంద్రం ఆయుష్మాన్ భారత్ పథకం కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. కొత్త ప్రాజెక్టులు రాష్ట్ర ప్రజలకు విస్తారమైన ఉపాధి అవకాశాలను కల్పిస్తాయని, ప్రజల జీవితాలను మరింత సులభతరం చేస్తాయని అన్నారు. గిరిజన ప్రజలకు సౌకర్యాలు, అభివృద్ధి కనిపిస్తాయని అన్నారు.
అంతకుముందు ప్రధాని సభకు వస్తూ ముగ్గురు బస్ ప్రమాదంలో మరణించారు. వారి గురించి మాట్లాడుతూ.. ఈ ప్రమాదంలో మరణించిన వారికి నివాళులు అర్పించారు. గాయపడిన వారికి చికిత్స కోసం అన్ని విధాల సహాయం అందచేస్తానని తెలిపారు. 2019లో రెండోసారి ప్రధానిగా ఎన్నికైన తర్వాత ఛత్తీస్ గఢ్ కు ప్రధాని రావడం ఇది రెండోసారి. ఈ ఏడాది చివర్లో ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఈ సారి చత్తీస్ గఢ్ లో అధికారంలోకి రావాలని బీజేపీ ప్లాన్ చేసింది. వరసగా మూడు సార్లు 15 ఏళ్ల పాటు ఈ రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉంది. 2018 ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది.
- Tags
- bjp
- Chhattisgarh
- congress
- PM Modi
తాజావార్తలు
-
Rahul Gandhi: ‘‘రాహుల్ గాంధీ భయపడ్డారు’’.. అఖిలేష్ హామీతో రాయ్‌బరేలీలో పోటీ..
-
Oben Rorr EVO: 180KM రేంజ్.. 8 ఏళ్ల బ్యాటరీ వారంటీ.. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ బైక్ ఇదే..!
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
-
WhatsApp: వాట్సాప్ లో కొత్త సెక్యూరిటీ ఫీచర్.. AI కూడా మీ చాట్ చదవలేదట! Restricted Chat ఎలా పనిచేస్తుందంటే?
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!