Rahul Gandhi: దేశ రాజధాని ఢిల్లీలోని విజ్ఞాన భవన్లో ఇవాళ జరుగుతున్న కాంగ్రెస్ న్యాయ సదస్సులో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. 2014 నుంచి జరుగుతున్న ఎన్నికలపై అనేక అనుమానాలు ఉన్నాయని తెలిపారు. ఒకే పార్టీ అన్ని స్థానాలు గెలుచుకోవడం ఏంటి.. అయితే, కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి కనీసం ఒక్క సీటు కూడా రాకపోవడం ఏంటో అర్థం కావడం లేదన్నారు. కేవలం, బీజేపీకి గంపగుత్తగా ఓట్లు పడటంపై మేము దృష్టి పెట్టాం.. ఆధారాల కోసం 6 నెలలు పని చేశాం.. ఎన్నికల కమిషన్ మాకు ఒరిజినల్ ఓటర్ లిస్ట్ ఇవ్వలేకపోయిందని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
అయితే, ఈసీ ఇచ్చిన ఓటర్ లిస్టును స్కాన్ చేయలేం. కాపీ చేయలేమని లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ అన్నారు. లోక్ సభ ఎన్నికలు చోరీకి గురయ్యాయి.. గత దఫాలుగా లోక్ సభ ఎన్నికలు రిగ్ అయ్యాయని ఆరోపించారు. ప్రతీ 6.5 లక్షల మంది ఓటర్లలో లక్షన్నర ఓట్లు ఫేక్ అని తేలింది.. ఈసీ ఇచ్చిన వివరాలతో పోలిస్తే మోసం బయటపడింది అన్నారు. దేశంలో ఎన్నికల వ్యవస్థ చచ్చిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, 15 సీట్లతో మోడీ ప్రధాని అయ్యారు.. ఆ 15 సీట్లు లేకుంటే ప్రధాని పదవి మోడీకి దక్కేది కాదన్నారు. రాబోయే రోజుల్లో ఇవన్నీ బయట పెడుతాం..మా దగ్గర 100 శాతం ఆధారాలున్నాయి.. రఫేల్ డీల్ లో పీఎంవోతో పాటు NSA జోక్యం చేసుకున్నాయి.. దీనికి సంబంధించి మా దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయని రాహుల్ గాంధీ తెలియజేశారు.
