NTV Telugu Site icon

MP: 15 నిమిషాల్లో రెండు సార్లు మంత్రిగా ప్రమాణం చేసిన రావత్

Mp

Mp

మధ్యప్రదేశ్‌లో మంత్రివర్గ విస్తరణలో విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది. సోమవారం మినీ కేబినెట్ విస్తరణ జరిగింది. అయితే ఇటీవల కాంగ్రెస్‌ నుంచి బీజేపీలో చేరిన ఎమ్మెల్యే రాంనివాస్ రావత్‌కు ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ మంత్రివర్గంలో చోటు కల్పించారు. దీంతో రాజ్‌భవన్‌లో కార్యక్రమం ఏర్పాటు చేశారు. గవర్నర్ మంగూభాయ్ సి పటేల్‌.. రావత్‌చే మంత్రిగా ప్రమాణం చేయించారు. అయితే రావత్ ప్రమాణం చేసేటప్పుడు రాష్ట్ర మంత్రిగా ప్రమాణం చేస్తున్నట్లు చదివారు. పొరపాటును గమనించి.. తిరిగి 15 నిమిషాల వ్యవధిలో మరోసారి కేబినెట్ మంత్రిగా ప్రమాణస్వీకారం చేయించారు. ఇలా దేశ చరిత్రలో నిమిషాల వ్యవధిలో రెండు సార్లుగా మంత్రిగా ప్రమాణం చేయడం ఇదే తొలిసారి.

ఇది కూడా చదవండి: Saripodhaa Sanivaaram: చారులతగా ఆకర్షిస్తున్న ఓజి హీరోయిన్

షియోపూర్ జిల్లాలోని విజయ్‌పూర్ స్థానం నుంచి రావత్ ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఏప్రిల్‌లో లోక్‌సభ ఎన్నికల సమయంలో బీజేపీలో చేరారు. గతంలో దిగ్విజయ్ సింగ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో హోంమంత్రిగా పనిచేశారు. తాజాగా మంత్రిగా ప్రమాణం చేశాక.. కాంగ్రెస్‌కు, ఎమ్మెల్యే పదవికి రావత్ రాజీనామా చేశారు. దీంతో విజయ్‌పూర్ స్థానానికి ఉప ఎన్నిక రానుంది. కాంగ్రెస్ చీఫ్ పదవి ఇవ్వకపోవడంతోనే అలకబూని రావత్ బీజేపీలో చేరారు. ప్రస్తుతం సీఎం మోహన్ యాదవ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో ముఖ్యమంత్రి మినహా 30 మంది మంత్రులు ఉన్నారు. ఇద్దరు డిప్యూటీ సీఎంలు, 18 మంది కేబినెట్ మంత్రులు, 10 మంది రాష్ట్ర మంత్రులు ఉన్నారు. మరో 3 ఖాళీలు కూడా ఉన్నాయి.

ఇది కూడా చదవండి: NEET UG 2024: నీట్ కేసుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు.. విచారణ వాయిదా

బీజేపీ తీరుపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి అవనీష్ బుందేలా మండిపడ్డారు. సుపరిపాలన అంటూ బీజేపీ చెప్పుకోవడాన్ని ప్రశ్నించారు. సుపరిపాలన అని చెప్పుకునే మోహన్ యాదవ్ ప్రభుత్వంలో ఈరోజు ఇంత నిర్లక్ష్యం జరిగిందన్నారు. ఇలాంటి పొరపాటు దేశంలో మునుపెన్నడూ చూడలేదన్నారు.