Actor Darshan case: కన్నడ స్టార్ హీరో దర్శన్ వ్యవహారం కర్ణాటకతో పాటు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. తన అభిమాని అయిన రేణుకా స్వామి అనే 33 ఏళ్ల వ్యక్తిని దారుణంగా హింసించి హత్య చేసిన ఘటనలో దర్శన్‌తో పాటు అతనితో సహజీవనం చేస్తున్న నటి పవిత్ర గౌడతో సహా 17 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. దర్శన్‌కి అప్పకే పెళ్లై భార్య ఉన్నప్పటికీ, పవిత్రతో కలిసి ఉండటం గురించి సోషల్ మీడియాలో స్వామి విమర్శలు చేయడం ఈ హత్యకు ప్రధాన కారణమైంది. చిత్రదుర్గకు చెందిన స్వామిని బెంగళూర్ రప్పించి, దారుణంగా కొట్టి చంపేశారు.
Read Also: Mulugu: ఫోన్లో వీడియోలు చూస్తున్న కుమార్తెను మందలించిన తల్లి..పురుగుల మందు తాగి ఆత్మహత్య
స్వామి మరణించిన తర్వాత నగరంలోని కామాక్షి పాళ్యలోని ఓ డ్రెయినేజీ కాలువలో అతడి మృతదేహం లభించింది. పోస్టుమార్టం నివేదికలో స్వామిని ఎలా చిత్రిహింసలు పెట్టారనే విషయాలు వెలుగులోకి వచ్చాయి. చనిపోయే ముందు అతడిని దారుణంగా కొట్టడంతో పాటు విద్యుత్ షాక్‌లు ఇచ్చారని వెల్లడైంది. రేణుకా స్వామి శరీరంపై మొద్దుబారిన గాయాలతో పాటు , చెవి కనిపించకుండా పోయిందని, వృషణాలపై దాడి చేసిన గుర్తులు ఉన్నట్లు తేలింది. గాయాలు, అంతర్గత రక్తస్రావంతో మరణించినట్లు పోస్టుమార్టం నివేదిక తెలుపుతోంది. రేణుకాస్వామి వీపు, చేతులు, ఛాతిపై నలుపు, నీలం రంగు గుర్తులు ఉన్నాయి. అతని నోరు విరిగిపోయి ఉందని నివేదిక వెల్లడించింది.