NTV Telugu Site icon

India At UN: కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తిన పాకిస్తాన్.. ఆగ్రహం వ్యక్తం చేసిన భారత్..

India At Un

India At Un

India At UN: దాయాది దేశం పాకిస్తాన్ మరోసారి ఐక్యరాజ్యసమితి వేదికగా ‘‘కాశ్మీర్’’ అంశాన్ని లేవనెత్తింది. దీనిపై భారత్ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. మహిళలు, శాంతిభద్రతలపై భద్రతా మండలి సమావేశంలో పాకిస్తాన్ చేసిన వ్యాఖ్యల్ని ‘‘రెచ్చగొట్టేవి’’, ‘‘రాజకీయ ప్రచారం’’ అని భారత్ తప్పుపట్టింది. పాకిస్తాన్‌లోని హిందువులు, సిక్కులు, క్రిస్టియన్లు మైనారిటీ వర్గాలకు చెందిన మహిళల పరిస్థితి దయనీయంగా ఉందని చెప్పింది.

Read Also: Diwali 2024: దీపావళి నాడు వాయు కాలుష్యంపై ఎలాంటి జాగ్రత్తలు వహించాలి..?

‘‘తప్పుడు సమాచారం, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తూ, ఒక వ్యూహం ఆధారంగా రెచ్చగొట్టే చర్యలకు పాల్పడటం జుగుప్సాకరమైనవి అయినప్పటికీ, పూర్తిగా వీటిని ఊహించవే’’ అని పాక్ వ్యాక్యలపై యూఎన్‌లో భారత శాశ్వత ప్రతినిధి పి హరీష్ శుక్రవారం యూఎన్‌ఎస్‌సీలో అన్నారు. ప్రపంచంలో మారుతున్న పరిస్థితుల్లో శాంతిని నెలకొల్పడమే అనే అంశంపై యూఎస్ఎస్‌సీ డిబేట్ సందర్భంగా భారత్ ఈ ప్రకటన చేసింది.

చర్చల్లో కాశ్మీర్ అంశాన్ని పాకిస్తాన్ లేవనెత్తడంపై భారత్ తీవ్రంగా స్పందించింది. ముఖ్యమైన వార్షిక చర్యలో ఇలాంటి రాజకీయ ప్రచారం చేయడం పూర్తిగా తప్పని చెప్పింది. పాకిస్తాన్లో మైనారిటీ వర్గాలకు చెందిన మహిళల పరిస్థితి, ముఖ్యంగా హిందువులు, సిక్కులు, క్రైస్తవుల పరిస్థిత దయనీయంగా ఉందని మాకు బాగా తెలుసని భారత్ రిప్లై ఇచ్చింది. పాకిస్తాన్ మానవ హక్కుల కమిషన్ డేటా ప్రకారం ఈ మైనారిటీ కమ్యూనిటీలకు చెందిన వెయ్యి మంది మహిళలు ప్రతి సంవత్సరం అపహరణకు, బలవంతపు మత మార్పిడులకు మరియు బలవంతపు వివాహాలకు గురవుతున్నారని హరీష్ తెలిపారు.