Sexual Assault on Girl: దేశరాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. ఓ మైనర్ బాలుడు 16 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. నిర్మాణంలో ఉన్న భవనంలో దొంగతనం చేయాలని ప్రవేశించిన బాలుడు అక్కడే పనిచేస్తున్న 16 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు బుధవారం తెలిపారు. వాయువ్య ఢిల్లీలోని అశోక్ విహార్ ప్రాంతంలో మంగళవారం ఈ అత్యాచార ఘటన చోటుచేసుకుంది.
Read Also: IPL 2023: పాయింట్ల పట్టికలో టాప్ లో ఆ టీమ్.. రెండో స్థానంలో పంజాబ్ కింగ్స్
నిర్మాణంలో ఉన్న ఓ భవనంలో అక్కడే పనిచేస్తున్న బాధిత బాలిక అక్కడే తల్లిదండ్రులతో తాత్కాలిక ఇంట్లో నివసిస్తున్నారు. ఇది గమనించిన బాలుడు ఆ ఇంట్లో దొంగతనం చేయడానికి ప్రయత్నించాడు. ఆ సమయంలో బాలిక తల్లిదండ్రులు వేతనం తీసుకోవడానికి ఇతర ప్రాంతానికి వెళ్లడంతో బాలిక ఒంటరిగా ఇంట్లో ఉంది. నిందితుడు ఇంట్లో ప్రవేశించే సమయంలో మైనర్ బాలిక, ఆమె 18 ఏళ్ల అక్కతో అక్కడే ఉండటం చూశాడు.
పరిస్థితిని తనకు అనుకూలంగా ఉన్నాయని భావించిన బాలుడు బాలికలను కత్తితో బెదిరించి, భవనంలోని ఓ ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసుల తెలిపారు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదుతో పలు సెక్షన్ల కింద బాలుడిపై అత్యాచారం సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.