Earthquake: సాధారణంగా ప్రకృతి చూడడానికి చాల అందంగా ఉంటుంది. కానీ ఒక్కసారి ఆ ప్రకృతి ఆగ్రహిస్తే ఎలా ఉంటుంది అనే ఊహ కూడా అతిభయంకరంగా ఉంటుంది. ఎందుకంటే ప్రకృతి విపత్తు తీవ్రస్థాయిలో ప్రాణనష్టం, ఆస్తినష్టం జరిగిన ఘటనలు గతంలో కోకొల్లలు. అందుకే ఏదైనా ప్రకృతి విపత్తు సంభవించబోతుంది అనే సందేహం కలిగిన మనం ఆ విపత్తు నుండి బయట పడడానికి ఎంతగానో ప్రయత్నిస్తాం.అలా భూమి స్వల్పంగా కపించిందో లేదో ప్రజలు భయంతో బయటకు పరుగులు తీశారు. ఈ ఘటన గౌహతిలో చోటు చేసుకుంది. గౌహతిలో స్వల్పంగా భూమి కంపించింది. దీనితో ప్రజలు భయాందోళనలకు గురైయ్యారు. ఈ నేపధ్యంలో ప్రజలు భయంతో ఇల్లలో నుండి బయటకు పరుగులు తీశారు.
Read also:Chief Minister Revanth Reddy Live Updates: రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం లైవ్ అప్డేట్స్
వివరాలలోకి వెళ్తే.. అస్సాం రాజధాని అయినటువంటి గౌహతిలో గురువారం ఉదయం 5.42 గంటలకు స్వల్ప భూమి కంపించింది. ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనలకు గురైయ్యారు. దీనితో ఉన్నపలంగా ఇల్లలో నుండి బయటకు పరుగులు తీశారు. కాగా ఈ విషయం గురించి నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ వివరణ ఇస్తూ.. గురువారం ఉదయం 5.42 గంటలకు 3.5 తీవ్రతతో స్వల్పంగా భూమి కంపించిందని పేర్కొంది. కాగా భూ అంతర్భాగంలో 5 కిలోమీటర్ల లోతులో భూమి కంపించిందని తెలిపింది. అలానే గౌహతికి 63 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నదని.. ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు భయంతో ఇల్లలో నుండి బయటకు పరుగులు తీశారని పేర్కొంది. కాగ ఈ భూకంపం వల్ల ప్రాణ నష్టం జరగినట్టుగాని.. అలానే ఆస్తినష్టం జరగినట్టుగాని ఎలాంటి సమాచారం అందలేదని అధికారులు పేర్కొన్నారు.
Mild earthquake in Guwahati