Sugar Mill Fire Accident: ఉత్తరప్రదేశ్ చక్కెర మిల్లులో భారీ అగ్నిప్రమాదం.. ఒకరు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Massive Fire Erupts At Sugar Mill In Uttar Pradesh Meerut: ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ఈరోజు (26-11-22) మధ్యాహ్నం మొహియుద్దీన్‌పూర్ చక్కెర మిల్లులో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో నరేంద్ర కుష్వాహా అనే ఒక ఇంజినీర్ మృతి చెందాడు. ఘటనలో తీవ్ర గాయాలపాలైన అతడ్ని ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. మిల్లు నుంచి పెద్దఎత్తున పొగలు రావడంతో.. ఉద్యోగులు ఒక్కసారిగా సురక్షిత ప్రాంతాలకు పరుగు తీశారు.
ఈ ఘటన గురించి మిల్లు జనరల్ మేనేజర్ శీష్‌పాల్ సింగ్ మాట్లాడుతూ.. ఫ్యాక్టరీలో ఒక టర్బైన్ ఒక్కసారిగా ట్రిప్ అయ్యిందన్నారు. దాన్ని పరిశీలించడానికి తాము వెళ్లగా.. ఇంతలో దట్టమైన పొగలు ఫ్యాక్టరీని చుట్టుముట్టడం ప్రారంభించాయన్నారు. అప్పుడు ఫ్యాక్టరీలో ఉన్న ఉద్యోగులు విద్యుత్ సరఫరాను నిలిపివేసి.. వెంటనే బయటకు పరుగులు తీశారని పేర్కొన్నారు. అయితే.. ఈ ఘటనలో తమ ఇంజినీర్‌లలో ఒకరు తీవ్రంగా గాయపడిన కారణంగా, అతడ్ని ఆసుపత్రికి తరలించామన్నారు. కానీ, పరిస్థితి విషమించడంతో అతడు చికిత్స పొందుతూ మరణించాడన్నారు.
Also Read
ఇక ఈ ఘటనపై ఫైర్ ఆఫీసర్ ఆర్‌కే సింగ్ మాట్లాడుతూ.. తమకు ఈ ఫైర్ యాక్సిడెంట్ గురించి మధ్యా్హ్నం 3 గంటలకు సమాచారం అందిందని, వెంటనే తాము సంఘటనా స్థలానికి చేరుకున్నామని తెలిపారు. ఇదో భారీ అగ్ని ప్రమాదం కావడంతో తాము తొలుత పత్తాపూర్ నుంచి రెండు, ఆ తర్వాత పోలీస్ లైన్ నుంచి మరో నాలుగు ఫైర్ టెండర్స్‌ని పిలిచామన్నారు. మంటలను ఆర్పేందుకు మొత్తంగా ఏడు ఫైర్ టెండర్లు సేవలో ఉన్నాయన్నారు. మంటలు ఆర్పేశాక.. ఎంత నష్టం జరిగింది, ఈ ఘటనకు గల కారణాలేంటో తెలుసుకుంటామని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Gandhi Jayanti: బాపూఘాట్లో మహాత్ముడికి సీఎం రేవంత్, గవర్నర్ ఘన నివాళులు..
-
FASTag నిబంధనల్లో కీలక మార్పులు.. వారికి గుడ్‌న్యూస్..
-
Lal Bahadur Shastri Jayanti: నిరాడంబరతకు నిలువెత్తు నిదర్శనం.. ‘జై జవాన్ జై కిసాన్’ రూపశిల్పి శాస్త్రి జీ..
-
Vivo T5 Lite 5G, T5 Pro 5G: వివో T5 Lite 5G, వివో T5 Pro 5G కొత్త RAM, స్టోరేజ్ వేరియంట్లు విడుదల.. ధరలు, ఫీచర్లు ఇవే
-
Harbhajan Singh: అతడు మరింత పదునెక్కుతున్నాడు.. ఈ వయసులోనే ఆ ఘనతలు అసాధ్యం!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?