Tamil Nadu: “తమిళం నేర్పలేనిది క్రైస్తవ మతం నేర్పింది”.. విజయ్ మంత్రి వ్యాఖ్యల కలకలం..
- తమిళ ఆర్థిక మంత్రి మేరీ విల్సన్ వ్యాఖ్యలపై రాజకీయ దుమారం..
- తమిళం నేర్పలేదని క్రైస్తవ మతం నేర్పిందని కామెంట్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tamil Nadu: తమిళనాడు ఆర్థిక మంత్రి ఎన్ మేరీ విల్సన్ చేసిన వ్యాఖ్యలు ఆ రాష్ట్రంలో రాజకీయంగా వివాదానికి దారితీశాయి. ‘‘తమిళ భాషను ఎంత చదివినా కొందరు అర్థం చేసుకోలేని విషయాలను క్రైస్తవ మతం తనకు నేర్పింది’’ అని ఆయన అసెంబ్లీలో వ్యాఖ్యానించారు. దీనిపై బీజేపీ తీవ్ర విమర్శలు చేస్తూ.. తమిళ భాషను కించపరిచొద్దని వార్నింగ్ ఇచ్చింది. బడ్జెట్ ప్రసంగంలో మంత్రి తమిళ భాషను సరిగా మాట్లాడలేదని, వ్యాకరణపరమైన తప్పులు ఉన్నాయని ఎండీఎంకే ఎమ్మెల్యే టీఎం రాజేంద్రన్ విమర్శించారు. భవిష్యత్తులో అసెంబ్లీలో మాట్లాడే అవకాశం వస్తే తప్పులు లేకుండా తమిళంలో మాట్లాడాలని అన్నారు.
క్రైస్తవ మతం తనకు ప్రేమ భాష, శాంతి భాష, కరుణ భాష నేర్పిందని విల్సన్ అన్నారు. ఎంతగా తమిళాన్ని అధ్యయనం చేసినా కొందరు ఈ విలువలను అర్థం చేసుకోలేరని వ్యాఖ్యానించారు. తాను బైబిల్ చదివానని, పుట్టుకతోనే క్రైస్తవుడినని అన్నారు. తన ప్రాధాన్యత తమిళ భాషకు సంబంధించిన విమర్శలు కావని, తమిళ పాలన, రాష్ట్రాభివృద్ధికి సంబంధించినవని అన్నారు. తాను మాట్లాడే శైలిని, వ్యక్తిత్వాన్ని విమర్శిస్తూ కొందరు ఎగతాళి చేస్తున్నారని ఆరోపించారు.
Also Read
- US LPG Supply: భారత్‌కు ఎల్పీజీ సరఫరాలో అమెరికా సరికొత్త రికార్డు..
- Heavy Rainfall: వర్ష బీభత్సం.. ఉత్తరప్రదేశ్‌లో 65 గంటల పాటు భారీ వర్షం.. 14 రాష్ట్రాల్లో అలర్ట్
- LNG Dual-Fuel Train in India: భారత రైల్వేలో కొత్త అధ్యాయం.. నేడు అమిత్ షా చేతుల మీదుగా తొలి LNG రైలు ప్రారంభం
- Gyanesh Kumar: ‘‘నాకు బీజేపీ టికెట్ ఆఫర్ చేశారు’’.. జ్ఞానేష్ కుమార్‌పై మాజీ కేరళ సీఎస్ సంచలన ఆరోపణలు
మంత్రి వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ తీవ్రంగా స్పందించారు. వ్యక్తిగత మత విశ్వాసాల గురించి మాట్లాడే క్రమంలో తమిళ భాషను కించపరిచేలా మంత్రి మాట్లాడారని ఆరోపించారు. ఆయన మతం నేర్పిన విషయాల గురించి అభ్యంతరం లేదని, కానీ తమిళాన్ని ఎందుకు కించపరిచారని విమర్శించారు. తమిళభాషను మతంలో పోల్చడం, మతం కన్నా తక్కువగా చూపించే ప్రయత్నం మంచిది కాదని, విల్సన్ బహిరంగ క్షమాపణలు చెప్పాలని నాగేంద్రన్ డిమాండ్ చేశారు.
బీజేపీ నేత వినోజ్ పి. సెల్వం విల్సన్ వ్యాఖ్యల్ని విమర్శించారు. టీవీకేను క్రైస్తవ ముఖ్యమంత్రి నడిపిస్తున్న క్రైస్తవ పార్టీగా అభివర్ణించారు. ఆ పార్టీ పూర్తిగా తమ మత విశ్వాసాలు, వ్యవస్థను తమిళ సంస్కృతిలోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి విజయ్ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. మరోవైపు, తమిళ బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు మంత్రి విల్సన్ క్రాస్ గుర్తు గీసిన వీడియో సోషల్ మీడియాలో వైరలైంది.
తాజావార్తలు
-
Secretariat Employees: సచివాలయ ఉద్యోగుల ఆందోళన.. ధర్నాచౌక్ వద్ద ఉద్రిక్తత!
-
Amazon Early Deals: కొత్త ఫోన్, ల్యాప్‌టాప్, టీవీ కొనాలనుకుంటున్నారా? అమెజాన్ ఫెస్టివల్ సేల్ ఎర్లీ డీల్స్ ఇవిగో
-
Rohit Sharma: ‘ఇంకా ఆ పని పూర్తి కాలేదు’.. రిటైర్మెంట్పై హిట్ మ్యాన్ రోహిత్ శర్మ సంచలన ప్రకటన..
-
Ranbir Kapoor : ఇక గ్యాప్ ఇవ్వనంటోన్న రణబీర్ కపూర్
-
US LPG Supply: భారత్‌కు ఎల్పీజీ సరఫరాలో అమెరికా సరికొత్త రికార్డు..
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?