Encounter: ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి పోలీసులు, మావోయిస్టులకు మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. ఆ రాష్ట్రంలో భెజ్జీ ప్రాంతంలో జరిగిన కాల్పుల్లో పలువురికి గాయాలైనట్లు తెలుస్తోంది. ఈ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు హద్మా అలియాస్ సంకు మృతి చెందినట్లు సమాచారం. ప్రస్తుతం హద్మా అలియాస్ సంకు మావోయిస్టు డీవీసీఎం కమాండర్‌గా పని చేస్తున్నట్లు సమాచారం.
హద్మా అలియాస్ సంకు మాడ్ ప్రాంతంలో చురుకైనా మావోయిస్టుగా గుర్తింపు పొందారు. సుక్మాలోని దాదాపు అన్ని ప్రధాన సంఘటనల్లోనూ హుద్మా ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలోని అటవీ ప్రాంతంలో సోమవారం భద్రతా బలగాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఓ నక్సల్ హతమయ్యాడని పోలీసులు తెలిపారు. జిల్లా రిజర్వ్ గార్డ్ బృందం నక్సల్స్ వ్యతిరేక ఆపరేషన్‌లో ఉన్నప్పుడు భెజ్జీ పోలీస్ స్టేషన్ పరిధిలోని భండార్‌పదర్ గ్రామ సమీపంలోని అడవిలో ఈ ఉదయం కాల్పులు జరిగినట్లు ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (బస్తర్ రేంజ్) సుందర్‌రాజ్ వెల్లడించారు. ఉదయం 7:30 గంటల ప్రాంతంలో పెట్రోలింగ్ బృందం అడవి గుండా ముందుకు వెళుతుండగా.. ఇరువర్గాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.
Gyanvapi case: జ్ఞానవాపీ కేసులో ముస్లింల తరపు న్యాయవాది గుండెపోటుతో మృతి
తుపాకీ కాల్పులు ఆగిన తర్వాత, ఘటనా స్థలం నుంచి ఒక అల్ట్రా మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నామని, ప్రాథమికంగా చనిపోయిన మావోయిస్టును మావోయిస్టుల డివిజనల్ కమిటీ సభ్యుడు (డీవీసీ) మాద్వి హద్మాగా గుర్తించామని ఐజీ తెలిపారు. సమీప ప్రాంతాల్లో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని ఆయన తెలిపారు. గత పది రోజుల్లో సుక్మా జిల్లాలో జరిగిన వేర్వేరు ఎన్‌కౌంటర్‌లలో నక్సల్స్‌ను హతమార్చడం ఇది మూడోసారి.