Site icon NTV Telugu

Boeing: బోయింగ్ విమానాలపై ఎన్నో ఆరోపణలు.. పడిపోయిన షేర్లు..

Boeing

Boeing

Boeing: ఎయిరిండియా 787-8 డ్రీమ్ లైనర్ కుప్పకూలింది. ప్రయాణికులు, సిబ్బందితో కలిపిన 242 మందితో అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న విమానం టేకాఫ్ అయిన కొన్ని నిమిషాల్లోనే కూలిపోయింది. ఈ ప్రమాదం తర్వాత మరోసారి బోయింగ్ విమానాల భద్రతలపై ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ భద్రత, నాణ్యత, నియంత్రణ సమస్యలపై మరోసారి వివాదం మొదలైంది.

ఫ్యూజ్‌లేజ్ షిమ్మింగ్, స్కిన్ సర్పేసింగ్ సమస్యలపై గతంలో పలువురు ఇంజనీర్లు ఆరోపణలు వ్యక్తం చేశారు. పలువురు విజిల్‌బ్లోయర్లు బోయింగ్ అక్రమాలకు పాల్పడుతోందని ఆరోపించారు. విమానాల తయారీలో షార్ట్‌కట్స్‌‌ల వైఫల్యాలపై హెచ్చరించారు 2020లో అనేక 787 విమానాలను ఫ్యూజ్‌లేజ్ షిమ్మింగ్ స్కిన్ సర్ఫేసింగ్ తో సహా నాణ్యత నియంత్రణల సమస్యల కారణంగా గ్రౌండింగ్ చేశారు.

Read Also: Air India Plane Crash: ప్రమాద సమయంలో 80-90 టన్నుల ఇంధనం.. ‘‘ఫ్యూయల్ డంప్’’ సమయం కూడా లేదు..

బోయింగ్ ఇంజనీర్ సామ్ సలేహ్‌పూర్ 787, 777 రెండింటిలోనూ తయారీ షార్ట్‌కట్‌లు, సంభావ్య నిర్మాణ వైఫల్యాలపై వార్నింగ్ ఇచ్చారు. ఈ సమస్యలు విమానాల వయసు పెరుగుతున్న కొద్దీ ప్రమాదాలను తెచ్చిపెడుతాయని చెప్పారు. విజిల్‌బ్లోయర్ వాదనలపై FAA దర్యాప్తు కూడా చేసింది. ఫ్యూజ్‌లేజ్ విభాగాలను సరిగ్గా బిగించడం, విమాన మధ్యలో నిర్మాణ వైఫల్యాలను సంభావ్యతను పెంచే అవకాశం ఉంటుందనే ఆరోపణలపై FAA దర్యాప్తు చేసింది. తయారీ సమయంలో తీసుకున్న నిర్మాణ లోపాలు, షార్ట్‌కట్‌ల కారణంగా 787 ప్రమాదాలు జరుగొచ్చనే ఆందోళన ఎప్పటి నుంచో వ్యక్తం అవుతోంది. 787 నిర్మాణాన్ని ప్రభావితం చేసే ఏరోస్పేస్ -గ్రేడ్ టైటానియం మిశ్రమం బదులుగా స్టాండర్డ్ టైటానియం వంటి పదార్థాలను వినియోగిస్తున్నట్లు ఎఫ్ఏఏ గుర్తించింది.

ఇదిలా ఉంటే, అహ్మదాబాద్ విమాన ప్రమాదం తర్వాత ప్రీ-మార్కెట్ ట్రేడింగ్‌లో బోయింగ్ కంపెనీ షేర్ల ధరలు 6.5 శాతం పడిపోయాయి. బారీ ప్రమాదాలు, టెక్నికల్ ఫెయిల్యూర్స్, వివాదాల వల్ల చాలా మంది బోయింగ్ షేర్లను అమ్మేశారు. గతంలోనూ పలు బోయింగ్ విమానాలు భారీ ప్రమాదాలను ఎదుర్కొన్నాయి.

Exit mobile version