Site icon NTV Telugu

Manish Sisodia: మనీష్ సిసోడియాకు ప్రమోషన్.. పంజాబ్ ఇన్‌ఛార్జ్‌గా నియామకం

Manish Sisodia

Manish Sisodia

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీలో సంస్థాగత మార్పులకు అధిష్టానం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా శుక్రవారం ఆప్ అధినేత కేజ్రీవాల్ నేతృత్వంలో పార్టీ నేతలు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా పలువురి సీనియర్లకు కీలక బాధ్యతలు అప్పగించారు.

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన మనీషి సిసోడియా, సౌరభ్ భరద్వాజ్ లాంటి నాయకులకు కీలక బాధ్యతలు అప్పగించారు. ఢిల్లీ ఆప్ విభాగానికి సౌరబ్ భరద్వాజ్, పంజాబ్ ఇన్‌ఛార్జ్‌గా మనీషి సిసోడియాను నియమించారు. సౌరబ్ భరద్వాజ్.. గ్రేటర్ కైలాష్ నియోజకవర్గం నుంచి 3 సార్లు ఎమ్మె్ల్యేగా గెలిచారు. అలాగే రెండు సంవత్సరాలు ఢిల్లీ ఆరోగ్య మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. ఈ నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఢిల్లీ యూనిట్ అధ్యక్షుడిగా సౌరభ్ భరద్వాజ్ బాధ్యతలు నిర్వహించనున్నారు.

ఇది కూడా చదవండి: Kriti Sanon : ప్రేమ కోసం ప్రాణం ఇచ్చే అమ్మాయిలు కూడా ఉన్నారు..

మొత్తం నాలుగు రాష్ట్రాలకు ఇన్‌ఛార్జ్‌లను నియమించినట్లు పార్టీ ప్రకటించింది. ఇక జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర అధ్యక్షుడిగా మహారాజ్ మాలిక్‌ను నియమించింది. సీనియర్ నాయకులు గోపాల్ రాయ్, దుర్గేష్ పాఠక్‌లను వరుసగా గుజరాత్ ఇన్‌చార్జ్ మరియు సహ ఇన్‌చార్జ్‌లుగా నియమించారు. పంకజ్ గుప్తాను గోవా ఆప్ ఇన్‌చార్జ్‌గా నియమించింది. మనీష్ సిసోడియాను పంజాబ్ ఇన్‌చార్జ్‌గా, సతేంద్ర జైన్‌ను కో-ఇన్‌చార్జ్‌గా నియమించారు. రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దాను మాత్రం రాష్ట్ర కో-ఇన్‌చార్జ్ పదవి నుంచి తప్పించారు. ప్రస్తుతం పంజాబ్‌లోనే ఆప్ అధికారంలో ఉంది. ఇక పంజాబ్‌కు చెందిన రాజ్యసభ ఎంపీ సందీప్ పాఠక్‌ను ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర ఇన్‌చార్జ్‌గా నియమించారు.

ఫిబ్రవరిలో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఓటమి పాలైంది. 70 అసెంబ్లీ స్థానాలకు గాను బీజేపీ 48, ఆప్ 22 స్థానాలు గెలుచుకున్నాయి. రేఖా గుప్తా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇక అతిషికి ప్రతిపక్ష హోదా దక్కింది.

ఇది కూడా చదవండి: Betting Apps : బెట్టింగ్‌ యాప్స్‌ కేసులో కీలక పరిణామం.. సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఎస్పీ సంచలనన వ్యాఖ్యలు

Exit mobile version