NTV Telugu Site icon

Manipur Congress Chief: మణిపూర్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడికి ఈడీ సమన్లు..

Manipur

Manipur

Manipur Congress Chief: మణిపూర్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కె మేఘచంద్ర సింగ్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) సమన్ల జారీ చేసింది. మణిపూర్ పీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి ఎన్ బుపెండా మెయిటే మాట్లాడుతూ.. ఈడీ ప్రతీకార రాజకీయాలకు దిగుతుందని విమర్శించారు. కేంద్రంలో, మణిపూర్‌లోని బీజేపీ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నిర్భయంగా ఆందోళనలు చేయడంలో మేఘచంద్ర కీలక పాత్ర పోషించారని చెప్పుకొచ్చారు. మే 2023 నుంచి రాష్ట్రంలో కొనసాగుతున్న గందరగోళాల మధ్య ఈ ప్రభుత్వాల వైఫల్యాలను ఎత్తి చూపుతూ మేఘచంద్ర ప్రజలకు బలమైన నాయకుడిగా ఎదుగుతున్నారని బుపెండా మెయిటే పేర్కొన్నారు.

Read Also: Mushrooms: పుట్టగొడుగులు ఆరోగ్యానికి మంచివేనా? మరి ఏ రకమైన వాటిని తినడం మంచిది?

ఇక, కాంగ్రెస్ నేతలపై ఈడీ పగ, వేధింపులు, ప్రతీకార రాజకీయాలకు దిగుతుందని మణిపూర్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఎన్ బుపెండా మెయిటే ఆరోపించారు. మణిపూర్‌లో తమ వైఫల్యాలను కప్పిపుచ్చడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.. సంక్షోభ సమయంలో రాష్ట్రాన్ని సందర్శించడానికి ప్రధాని నరేంద్ర మోడీ నిరాకరించడాన్ని ఆయన గుర్తు చేశారు. ఈడీ, సీబీఐ కేసులతో కాంగ్రెస్‌ను భయపెట్టలేరు.. రాహుల్ గాంధీ నిర్భయమైన నాయకుడు.. ఈ ఈడీ సమన్లు ​​మమ్మల్ని నిశ్శబ్దంగా ఉంచలేవన్నారు. తాము రాష్ట్ర, దేశ ప్రభుత్వ వైఫల్యాలను బహిర్గతం చేస్తామన్నారు. డబుల్- ఇంజిన్ ప్రభుత్వం ఫెయిల్ అయిందని బుపెండా మెయిటీ విమర్శలు గుప్పించారు. మణిపూర్ పీసీసీ చీఫ్ మేఘచంద్ర ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 7వ తేదీన న్యూ ఢిల్లీలో ఈడీ కార్యాలయానికి రావాల్సిందిగా అందులో పేర్కొన్నారు. అయితే, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఎదుట విచారణకు మేఘచంద్ర సింగ్ సోమవారం వెళ్లలేదు.