NTV Telugu Site icon

Tejashwi Yadav: ఇది ‘‘మంగళ్ రాజ్’’ పాలన.. వంతెనలు కూలిపోవడంపై తేజస్వీ సెటైర్లు..

Tejaswi

Tejaswi

Tejashwi Yadav: బీహార్ రాష్ట్రంలో వరసగా వంతెనలు కూలిపోతున్నాయి. తొమ్మిది రోజుల వ్యవధిలోని వివిధ ప్రాంతాల్లోని 5 వంతెనలు కుప్పకూలాయి. దీంతో బీహార్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయి ప్రతిపక్షాలు. ఆర్జేడీ నేత, మాజీ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ వంతెనల కూలిన ఘటనపై జేడీయూ-బీజేపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. సుపరిపాలన అనేది అంతా వట్టిదే అని అన్నారు.

Read Also: Hyderabad: ఇంటి ముందు క్యాంప్ ఫైర్.. ప్రశ్నించిన వారిపై కాలుతున్న కట్టెలతో..

తేజస్వీ యాదవ్ ఎక్స్ వేదికగా రాష్ట్రప్రభుత్వాన్ని ఉద్దేశించి విమర్శించారు. ‘‘అభినందనలు! బీహార్‌లో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం యొక్క డబుల్ పవర్ కారణంగా, కేవలం 9 రోజుల్లో కేవలం 5 వంతెనలు కూలిపోయాయి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మార్గదర్శకత్వంలో 6 పార్టీలతో కూడిన డబుల్ ఇంజిన్ ఎన్డీఏ ప్రభుత్వం 9 రోజుల్లో 5 వంతెనలు కూలిపోవడంతో బీహార్ ప్రజలకు మంగళ్‌రాజ్ (మంచి పాలన) శుభాకాంక్షలను పంపింది’’ అని ట్వీట్ చేశారు.

నితీష్ కుమార్ ప్రభుత్వం ‘‘సుపరిపాలన విన్యాసాలు’’ అని ప్రతిపక్షంగా సెటైర్లతో విమర్శిస్తోంది. వంతెనలు కూలిపోవడం వల్ల వేలాది కోట్ల ప్రజాధనం నష్టపోయామని అన్నారు. మధుబని జిల్లా ఝంఝర్‌పూర్‌లో నిర్మాణంలో ఉన్న వంతెన కూలిపోవడం, గడిచిన 11 రోజుల్లో ఐదవ ఘటన జరిగిన నేపథ్యంలో తేజస్వీ ఈ వ్యాఖ్యలు చేశారు. మధుబని ఘటనతో పాటు గత 11 రోజుల్లో మరో నాలుగు వంతెనలు కూలిపోవడంతో నిర్మాణ ప్రమాణాలు, పర్యవేక్షణపై తీవ్ర ప్రశ్నలు తలెత్తుతున్నాయి.