Tejashwi Yadav: ఇది ‘‘మంగళ్ రాజ్’’ పాలన.. వంతెనలు కూలిపోవడంపై తేజస్వీ సెటైర్లు..
- బీహార్‌లో వరసగా కూలిపోతున్న వంతెనలు..
- నితీష్ కుమార్ ప్రభుత్వంపై విమర్శలు..
- మంగళ్‌రాజ్ ప్రభుత్వమని తేజస్వీ సెటైర్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tejashwi Yadav: బీహార్ రాష్ట్రంలో వరసగా వంతెనలు కూలిపోతున్నాయి. తొమ్మిది రోజుల వ్యవధిలోని వివిధ ప్రాంతాల్లోని 5 వంతెనలు కుప్పకూలాయి. దీంతో బీహార్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయి ప్రతిపక్షాలు. ఆర్జేడీ నేత, మాజీ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ వంతెనల కూలిన ఘటనపై జేడీయూ-బీజేపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. సుపరిపాలన అనేది అంతా వట్టిదే అని అన్నారు.
Read Also: Hyderabad: ఇంటి ముందు క్యాంప్ ఫైర్.. ప్రశ్నించిన వారిపై కాలుతున్న కట్టెలతో..
Also Read
- Aadhaar Name Update: ఆధార్‌లో పేరు మార్చాలా? UIDAI కొత్త SOP.. ఇక ప్రతి మార్పుకు ప్రత్యేక అఫిడవిట్!
- Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
- KCC Loan Limit: రైతుకు KCC ద్వారా ఎంత డబ్బు వస్తుంది? భూమి, పంట ఆధారంగా లోన్ లిమిట్ ఎలా నిర్ణయిస్తారంటే
- Rahul Gandhi: ‘‘రాహుల్ గాంధీ భయపడ్డారు’’.. అఖిలేష్ హామీతో రాయ్‌బరేలీలో పోటీ..
తేజస్వీ యాదవ్ ఎక్స్ వేదికగా రాష్ట్రప్రభుత్వాన్ని ఉద్దేశించి విమర్శించారు. ‘‘అభినందనలు! బీహార్‌లో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం యొక్క డబుల్ పవర్ కారణంగా, కేవలం 9 రోజుల్లో కేవలం 5 వంతెనలు కూలిపోయాయి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మార్గదర్శకత్వంలో 6 పార్టీలతో కూడిన డబుల్ ఇంజిన్ ఎన్డీఏ ప్రభుత్వం 9 రోజుల్లో 5 వంతెనలు కూలిపోవడంతో బీహార్ ప్రజలకు మంగళ్‌రాజ్ (మంచి పాలన) శుభాకాంక్షలను పంపింది’’ అని ట్వీట్ చేశారు.
నితీష్ కుమార్ ప్రభుత్వం ‘‘సుపరిపాలన విన్యాసాలు’’ అని ప్రతిపక్షంగా సెటైర్లతో విమర్శిస్తోంది. వంతెనలు కూలిపోవడం వల్ల వేలాది కోట్ల ప్రజాధనం నష్టపోయామని అన్నారు. మధుబని జిల్లా ఝంఝర్‌పూర్‌లో నిర్మాణంలో ఉన్న వంతెన కూలిపోవడం, గడిచిన 11 రోజుల్లో ఐదవ ఘటన జరిగిన నేపథ్యంలో తేజస్వీ ఈ వ్యాఖ్యలు చేశారు. మధుబని ఘటనతో పాటు గత 11 రోజుల్లో మరో నాలుగు వంతెనలు కూలిపోవడంతో నిర్మాణ ప్రమాణాలు, పర్యవేక్షణపై తీవ్ర ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: ప్రయోగాలు ప్రేక్షకులను మెప్పించాయి.. సింగీతంకు డిప్యూటీ సీఎం పవన్ నివాళి!
-
Aadhaar Name Update: ఆధార్‌లో పేరు మార్చాలా? UIDAI కొత్త SOP.. ఇక ప్రతి మార్పుకు ప్రత్యేక అఫిడవిట్!
-
Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
-
KCC Loan Limit: రైతుకు KCC ద్వారా ఎంత డబ్బు వస్తుంది? భూమి, పంట ఆధారంగా లోన్ లిమిట్ ఎలా నిర్ణయిస్తారంటే
-
Prahaar : సాలిడ్ సక్సెస్ కోసం యంగ్ హీరోపై చాలా నమ్మకం పెట్టుకున్న నిర్మాణ సంస్థ
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!