Social Media: సోషల్ మీడియాకు కేవైసీ తప్పనిసరి..?
- సోషల్ మీడియాకు కేవైసీ తప్పనిసరి..
- ఆన్లైన్ హాని నుంచి మహిళలు, పిల్లల్ని రక్షించే లక్ష్యం..
- ప్రతిపాదనలు చేసిన పార్లమెంటరీ ప్యానెల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Social Media: ఆన్లైన్ హాని నుంచి మహిళలు, పిల్లల్ని రక్షించే ఉద్దేశంతో, సోషల్ మీడియాకు కేవైసీ తప్పనిసరి చేసే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. ముఖ్యంగా మైనర్లపై సోషల్ మీడియా ప్రభావం చాలా ఉంటుంది, దీనికి బానిసగా మారుతున్నవారు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో భారతదేశంలోని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల వినియోగదారులకు ‘నో యువర్ కస్టమర్’ (KYC) ధృవీకరణను తప్పనిసరి చేయాలని ఒక పార్లమెంటరీ ప్యానెల్ సిఫార్సు చేసింది. సైబర్ భద్రతపై మహిళా సాధికారత పార్లమెంటరీ కమిటీ నివేదికలో భాగంగా హోం మంత్రిత్వ శాఖ, సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖలకు ఈ ప్రతిపాదనల్ని సమర్పించింది.
కేవైసీ ఇందుకే:
Also Read
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
- CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
సోషల్ మీడియా, డేటింగ్ యాప్, గేమింగ్ ప్లాట్‌ఫారమ్స్ లలో కేవైసీ ఆధారిత గుర్తింపు, వయసు ధ్రువీకరణ వ్యవస్థ ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చింది. వినియోగదారుల్ని గుర్తింపు వ్యవస్థలను ఏర్పాటు చేయాలని కమిటీ పిలుపునిచ్చింది. వినియోగదారులను గుర్తించగలగడం,మైనర్లను ఆన్‌లైన్‌లో సురక్షితంగా ఉంచడం ద్వారా దుర్వినియోగాన్ని అరికట్టడమే దీని లక్ష్యం. కేవైసీ తప్పనిసరి చేయడం వల్ల నకిలీ ప్రొఫైల్స్, వేధింపులు, సైబర్ స్టాకింగ్ ఎదుర్కోవడంలో సహాయపడుతుంది.
డేటింగ్, గేమింగ్ యాప్‌ల కోసం కఠినమైన లైసెన్సింగ్ నిబంధనల్ని, వయసు నిర్ధారణ ప్రక్రియ చేపట్టాలని ప్యానెల్ సూచించింది. నిబంధనలు పాటించని ప్లాట్‌ఫారమ్స్‌పై చర్యలు, భారీగా జరిమానా విధించాలని ప్రతిపాదించింది. ఈ సిఫారసుల ద్వారా డిజిటల్ ప్లాట్‌ఫారమ్స్‌ను సురక్షితంగా మార్చడమే లక్ష్యంగా పెట్టకున్నారు. అయితే, ఇది యూజర్స్ డేటా, గోప్యతను దెబ్బతీసే అవకాశం ఉందనే ఆందోళనలు ఉన్నాయి.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!