Airport beggar: ఎయిర్‌పోర్టుల్లోనే బెగ్గింగ్.. ఈ బిచ్చగాడు యమ రిచ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Airport beggar: ఈజీ మణి కోసం చాలా మంది రకరకాల ప్లాన్స్ వేస్తూ వచ్చిన డబ్బుతో ఎంజాయ్ చేస్తుంటారు. వారికి కావాల్సిందే మణీ మాత్రమే. బ్రెయిన్ ఉపయోగించి ఐడియాలు వాడి ఎదుటి వారి నుంచి డబ్బులు తీసుకుని జల్సాలకు పాల్పడుతుంటారు. వారికి ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయో తెలియదు కానీ.. ఇలాంటి ఐడియాలు కొంత కాలమే పనిచేస్తాయని మాత్రం మర్చిపోతుంటారు. ఓ వ్యక్తి కష్టపడకుండా ఈజీగా మణి సంపాదించేదుకు ప్లాన్ వేశాడు. ఆప్లాన్ వర్కంట్ అవడంతో దాన్నే ఫాలో అయ్యాడు. అతను వేసిన ప్లాన్ వింటే ఆశ్చర్యపోవాల్సిందే. అదే బెగ్గింగ్ ప్లాన్ (అడుక్కోవడం). అదికూడ గుడి, ఫంక్షన్ హాల్లు దగ్గర కాదండో ఏకంగా ఎయిర్ పోర్టులోనే అడుక్కోవడం స్టార్ట్ చేశాడు. ఒక్కరోజుకు రూ. 50 నుంచి 60 వేల వరకు సంపాదించి జల్సాలకు పాల్పడే వాడు. ఇదే శాస్వతం అనుకున్నాడు. కానీ ఆ జల్సాలే అతన్ని పోలీసులకు పట్టుబడేలా చేశాయి.
చెన్నైకు చెందిన విఘ్నేష్ బీటెక్ పూర్తి చేసి కొన్నాళ్లు బెంగళూరులోని ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం చేశాడు. అప్పట్లో అతనికి నాలుగంకెల జీతం కూడా వచ్చేది. ఓసారి బెంగళూరు నుంచి చెన్నై రావడానికి ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకొని విమానాశ్రయానికి వస్తుండగా విఘ్నేష్ పర్చు పోగొట్టుకున్నారు. విమాన టికెట్ తన ఫోన్లోనే ఉన్నప్పటికీ చెన్నైలో దిగాక ఇంటికి వెళ్లేందుకు రూపాయి కూడా లేని పరిస్థితిని బెంగళూరు విమానాశ్రయం లాంజ్లో ఓ విదేశీయుడితో పంచుకున్నాడు. అతనిపై జాలిపడ్డ విదేశీయుడు రూ. 10 వేలు ఇచ్చాడు. ఆ తర్వాత కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఉద్యోగం కోల్పోవడంతో రోడ్డునపడ్డ విఘ్నేష్.. బెంగళూరు ఎయిర్పోర్టు అనుభవంతో ఈజీ మనీపై దృష్టి పెట్టాడు విఘ్నేష్ నిర్ణీత సమయానికి తక్కువ ధరకు వచ్చేలా డొమెస్టిక్ విమాన టికెట్లు బుక్ చేసుకొని, ఖరీదైన క్యాజువల్స్ ధరించి, చేతిలో లగేజ్ బ్యాగ్ తో ఎవరికి అనుమానం రాకుండా ప్లైట్ షెడ్యూల్ టైం కు ముందే ఎయిర్‌పోర్టులోకి ప్రవేశించేవాడు. ఒంటరిగా ప్రయాణిస్తున్న ప్యాసింజర్ ను ఎంచుకుని మాటలు కలిపేవాడు. ఆపై ఫోన్ సైలెంట్ మోడ్ లో ఉంచి బాధల్లో వున్నట్లు మాట్లాడినట్లు నటించేవాడు.
Also Read
- Uttar Pradesh: ఘోర విమాన ప్రమాదం.. పైలట్, కో-పైలట్ మృతి
- PM Modi: గ్రామీణ ప్రాంతాల ప్రతిభను వెలికితీయడమే ధ్యేయం.. 'ఖేలో ఇండియా' విజన్‌ను స్పష్టం చేసిన మోడీ
- Wedding Gift: వింత వెడ్డింగ్ గిఫ్ట్.. స్నేహితుడి భార్య ముఖాన్ని గుండెలపై శాశ్వతంగా వేయించుకున్న వ్యక్తి..!
- September 1 Rules Changes: సెప్టెంబర్ 1 నుంచి మారనున్న 5 కీలక విషయాలు.. మీ జేబుపై నేరుగా ప్రభావం!
దీంతో అతన్నే గమనిస్తున్న ప్యాసింజర్ జాలిపడి వీలైనంత సొమ్ము ఇచ్చేవాడు. ఇలా విఘ్నేష్ ఒక్కోరోజు రూ. 50 వేల నుంచి రూ. 60 వేలకు వరకు సంపాదించేవాడు. ఇలా హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ముంబై, ఢిల్లీ సహా ఎనిమిది నగరాల్లోని అంతర్జాతీయ విమానాశ్రయాల్లో తన జేబు నింపుకునేవాడు. చెన్నైలోని తన ఇంటికి వెళ్లి జల్సా చేసేవాడు. విఘ్నేష్ మోసంచేసిన వారిలో ఎక్కవ మంది విదేశీయులే కావడం గమనార్హం. ఎందుకంటే వీరికి ఇది మోసమని తెలిసే అవకాశం కూడా తక్కువ కాబట్టి విదేశీయులనే టార్గెట్ గా బెగ్గర్ దందా చేసేవాడు. దీంతో 2021 నుంచి విఘ్నేష్ దందా కొనసాగింది. అయితే విఘ్నేష్ పై ఇప్పటి వరకు ఎవరు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. దీంతో విఘ్నేష్ ఇంకా రెచ్చిపోయి 2023 వరకు బెగ్గర్ దందా కొనసాగిస్తూనే ఉన్నాడు. కాగా ఈనెల మే 11న బెంగళూరులోని కెంపెగౌడ ఇంటర్నేషన్ ఎయిర్ పోర్టులో ఇద్దరికి టోకరా వేసి మూడో వ్యక్తి దగ్గరకు విఘ్నేష్ వెళ్లడాన్ని గమనించిన ఓ సీఐఎస్‌ఎఫ్ అధికారి అతనిపై అనుమానం వచ్చి అతన్నే ఫాల్లో అయ్యాడు. విఘ్నేష్ చేస్తున్నది బెగ్గర్ దందాగా గుర్తించి అదుపులోకి తీకుని ప్రశ్నించగా నిర్ఘాంతపోయే నిజాలు వెలుగులోకి రావడంతో షాక్ తిన్నారు అధికారులు. విఘ్నేష్ ను అరెస్ట్ చేసి పోలీసులకు అప్పగించారు.
Special Combo: ‘వెంకీమామ’ తర్వాత భలే సెట్ చేశారు ‘బ్రో’!
తాజావార్తలు
-
Ananya Panday: లైగర్ బ్యూటీకి కష్టకాలం.. రెండేళ్ల ప్రేమకు గుడ్‌బై!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Uttar Pradesh: ఘోర విమాన ప్రమాదం.. పైలట్, కో-పైలట్ మృతి
-
Nepal Floods: 175కు చేరిన మృతుల సంఖ్య.. వరదల్లో 300 మందికి పైగా భారతీయులు గల్లంతు!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!
ట్రెండింగ్
-
Guinness World Record: లక్ష అడుగుల ఎత్తు నుంచి ఫోన్‌ను పడేసినా.. ఒక్క గీత కూడా పడలేదు.! అసలు మ్యాజిక్ ఏంటంటే?
-
Sugar Prices: పండగ వేళ షాక్.. ఒకరికి 2 కేజీలు మాత్రమే.. చక్కెర కొనుగోళ్లపై పరిమితి!
-
Dimensity 7100 చిప్, కొత్త Colour Fusion డిజైన్‌తో వచ్చేస్తున్న Ai+ Nova 2 Power..!
-
Wedding Gift: వింత వెడ్డింగ్ గిఫ్ట్.. స్నేహితుడి భార్య ముఖాన్ని గుండెలపై శాశ్వతంగా వేయించుకున్న వ్యక్తి..!
-
September 1 Rules Changes: సెప్టెంబర్ 1 నుంచి మారనున్న 5 కీలక విషయాలు.. మీ జేబుపై నేరుగా ప్రభావం!