Warangal Accident: వరంగల్ ఉమ్మడి జిల్లాలో రోడ్లు రక్తసిక్తమయ్యాయి. ఒకే రోజు మూడు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. రెండు చోట్ల సొంత అన్నదమ్ములు చనిపోతే మరో చోట తాత,మనవరాలు రోడ్డు ప్రమాదంతో మృత్యువాత పడ్డారు. వరంగల్ ఉమ్మడి జిల్లాలో రెండు చోట్ల వేరువేరుగా జరిగిన రోడ్డు ప్రమాదాలలో ఇద్దరు అన్నదమ్ములను బలి తీసుకున్నాయి. భూపాలపల్లి జిల్లాలో రోడ్డు ప్రమాదంలో తాత మనవరాలు మృతి చెందారు. హనుమకొండ జిల్లా హసన్ పర్తి మండలం అనంత సాగర్ వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొని హుజురాబాద్ మండలం కందుగులకు చెందిన ఇప్పలపల్లి శివరాం,హరికృష్ణ అన్నదమ్ములు చనిపోయారు. తెల్లవారుజామున అన్నను కాజీపేటలో ట్రైన్ ఎక్కించడానికి తీసుకెళుతుండగా ఈఘటన జరిగింది.
Read also: Variety haldi function: బీర్‌తో హల్దీ ఫంక్షన్ ఏంట్రా? ఆచారాలన్నీ సంక నాకిస్తున్నారు కదరా..!
జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం గర్మిళ్లపల్లి దగ్గర అదుపుతప్పి కారు బోల్తా పడి వరంగల్ నగరానికి చెందిన అన్నదమ్ములు ఆశిష్, అబిషేక్ మృతి చెందారు. టేకుమట్లలో ఓ శుభకార్యానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది. ఇక జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం భాగిర్తిపేట స్టేజి వద్ద జరిగిన ప్రమాదంలో తాత,మనవరాలు అక్కడికక్కడే మృతి చెందారు. తాత మనవారాలు వెళుతున్న బైక్ ని ఆర్టీసీ బస్సు డీ కొట్టడంతో ఇద్దరు మృత్యువాత పడ్డారు. మూడు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాలు మూడు కుటుంబాలను చిద్రం చేశాయి. కుటుంబ సభ్యులు బంధువులు కన్నీరుగా రోధిస్తున్నారు. మూడు చోట్ల రోడ్డు ప్రమాదాల్లో ఆరుగు మృతి చెందడంతో హృదయ విదారక దృశ్యాలు అందరిని కలిచివేస్తున్నాయి. ఇటువంటి ప్రమాదాలు జరగకుండా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నా రోడ్డు ప్రమాదాలకు మాత్రం అడ్డుకట్టు వేయలేక పోతున్నారు. బయటకు వెళ్లి ఇంటికి వచ్చేంత వరకు ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో అని కుటుంబ సభ్యులు బిక్కు బిక్కు మంటూ గడుపుతున్నారు.
Avinash Reddy Mother Health Condition: వైఎస్ అవినాష్‌రెడ్డి తల్లి ఆరోగ్య పరిస్థితిపై తాజా బులెటిన్ విడుదల..