Site icon NTV Telugu

Mamata Banerjee: లండన్‌లో సీఎం మమత చీర, చెప్పులతో జాగింగ్.. వీడియోలు వైరల్

Mamata

Mamata

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ లండన్‌లో పర్యటిస్తున్నారు. అధికారుల బృందంతో కలిసి బ్రిటన్‌లో పర్యటన కొనసాగుతోంది. యూకేతో సంబంధాలు మెరుగుపరుచుకునేందుకు అధికారులతో కలిసి ఆదివారం మమత లండన్‌లో అడుగుపెట్టారు. పర్యటనలో భాగంగా ఆమె లండన్ అందాలను వీక్షించారు.

ఇది కూడా చదవండి: 28°C : మరో కొత్త థ్రిల్లర్ కథతో రాబోతున్న నవిన్ చంద్ర

అంతేకాకుండా ముఖ్యమంత్రి మమత బకింగ్ హోమ్ ప్యాలెస్ నుంచి హైడ్ పార్కు వరకు జాగింగ్ చేశారు. వెనక్కి నడుస్తూ చప్పట్లు కొట్టారు. ముఖ్యమంత్రితో పాటు అధికారులు కూడా వార్మ్ ఆప్ చేస్తూ కనిపించారు. ఇందుకు సంబంధించిన చిత్రాలు, వీడియోలను టీఎంసీ నేత కునాల్ ఘోష్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇది నడక కాదు.. సన్నాహక కార్యక్రమం అంటూ రాసుకొచ్చారు. అధికారులతో కలిసి ముఖ్యమంత్రి నగర అందాలను ఆస్వాదించారని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే జాగింగ్ చేసే సమయంలో మమత.. తెల్లటి చీర, తెల్లటి చెప్పులు.. చల్లని వాతావరణాన్ని తట్టుకునేందుకు నల్ల కార్డిగాన్, శాలువా ధరించి కనిపించారు.

ఇది కూడా చదవండి: MLAs Defection Case: పార్టీ ఫిరాయింపుల కేసు.. సుప్రీంకోర్టులో కౌంటర్ దాఖలు చేసిన స్పీకర్..

ఇదిలా ఉంటే విదేశీ పర్యటనల్లో ఉన్నప్పుడు మమత ఇలా జాగింగ్‌లు చేయడం కొత్తేమీ కాదు. 2023లో స్పెయిన్ పర్యటనకు వెళ్లినప్పుడు కూడా మాడ్రిడ్‌లో చీర, చెప్పులు ధరించి జాగింగ్ చేశారు. ఆ సమయంలో ఫిట్‌గా ఉండండి.. ఆరోగ్యంగా ఉండండి అంటూ మమత పిలుపునిచ్చారు. బ్రిటన్‌తో బెంగాల్ సంబంధాలను బలోపేతం చేసే లక్ష్యంతోనే పర్యటిస్తున్నట్లు మమత తెలిపారు.

 

 

Exit mobile version