భారతీయ జనతా పార్టీ ఎన్ని ప్రయత్నాలు చేసినా.. ప్రధాని నరేంద్ర మోడీ, హోం శాఖ మంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినా.. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని విజయాన్ని అందుకుంది తృణమూల్ కాంగ్రెస్ పార్టీ.. బలమైన ప్రత్యర్థిపై బరిలోకి దిగా.. బీజేపీకి సవాల్ విసిరారు.. తనకు నమ్మిన వ్యక్తిగా ఉంటూ.. అదను చూసుకుని బీజేపీలో చేరిన సువేందు అధికారికి గుణపాఠం చెప్పాలన్న లక్ష్యంతో.. నందిగ్రాం నుంచి బరిలోకి దిగారు.. కానీ, బెంగాల్‌లో టీఎంసీ గ్రాండ్ విక్టరీ కొట్టినా.. ఆమె మాత్రం విజయం సాధించలేకపోయారు. అయినప్పటికీ ఆమె ముఖ్యమంత్రిగా మూడోసారి బాధ్యతలు స్వీకరించారు. నిబంధనల ప్రకారం దీదీ 6 నెలల్లో అసెంబ్లీకి ఎన్నిక కవాల్సి ఉండగా.. మరోసారి తన పాత నియోజకవర్గమైన కోల్‌కతాలోని భవానీపూర్ నుంచే బరిలోకి దిగనున్నారు.. తాజా ఎన్నికల్లో ఈ స్థానం నుంచి టీఎంసీ అభ్యర్థిగా పోటీచేసిన శోభన్‌దేబ్ చటోపాధ్యాయ విజయం సాధించగా.. ఇప్పుడు తమ పార్టీ అధినేత్రి కోసం తన పదవికి రాజీనామా చేశారు. ఇక, మమతా బెనర్జీ కేబినెట్‌లో శోభన్‌దేబ్ చటోపాధ్యాయ.. వ్యవసాయ మంత్రిగా ఉండగా.. ఆయన కూడా మరో ఆరునెలల్లోగా ఇంకా నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ఎన్నిక కావాల్సి ఉంటుంది. మొత్తంగా.. దీదీ మరోసారి తన పాత నియోజకవర్గం నుంచే పోటీ చేయనున్నారు.. ఎన్నికల సంఘం ఆ నియోజకవర్గంలో త్వరలోనే ఉప ఎన్నికలు నిర్వహించనుంది.